అమ‌ల‌-ప‌వ‌న్.. కుడి ఎడ‌మైతే

అల్లు వారి ఓటీటీ ఆహా కోసం కొత్త కంటెంట్ కోసం పెద్ద స్థాయిలోనే స‌న్నాహాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ధ్యే సామ్ జామ్ స‌హా కొన్ని కొత్త షోల‌ను మొద‌లుపెట్టారు. అలాగే వ‌రుస‌బెట్టి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు ఆహా కోసం పెద్ద సంఖ్య‌లోనే వెబ్ సిరీస్‌లు త‌యార‌వుతున్నాయి.

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు చాలామందే ఇందులో భాగ‌స్వాముల‌వుతున్నారు. ఇప్పుడు ఇత‌ర భాషల వాళ్ల‌నూ లైన్లో పెడుతున్నారు అల్లు వారు. బ‌హుభాషా న‌టి అమ‌లా పాల్‌.. క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ క‌లిసి ఆహా కోసం ఒక వెబ్ సిరీస్ చేయ‌బోతుండ‌టం విశేషం.

ఈ సిరీస్‌కు టైటిల్ కూడా ఖ‌రారైంది. కుడి ఎడ‌మైతే.. అంటూ ప‌క్కా తెలుగు టైటిల్‌తో ఈ క‌న్న‌డ ద‌ర్శ‌కుడు, మ‌ల‌యాళ న‌టి ఓ సిరీస్ చేయ‌బోతున్నారు. ఇదొక థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌నున్న సిరీస్ అంటున్నారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంటాయ‌ట‌.

ప‌వ‌న్ కుమార్ లూసియా సినిమాతో ఇండ‌స్ట్రీలోకి బ్యాంగ్ బ్యాంaxగ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత అత‌ను తీసిన యు ట‌ర్న్ కూడా సెన్సేష‌న‌ల్ హిట్ట‌యింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెలుగులో తీశాడు. అది ఓ మోస్త‌రుగా ఆడింది. ఇప్పుడ‌త‌ను ఆహా కోసం తెలుగులో వెబ్ సిరీస్ చేయ‌డం విశేష‌మే. బ‌హుశా ఇందులో స‌మంత హ్యాండ్ కూడా ఉంటే ఉండొచ్చేమో. త్వ‌ర‌లోనే ఈ సిరీస్ సెట్స్ మీదికి వెళ్ల‌నుంది.