Movie News

ఆదిత్య ధార్ మూడో షాక్ ఇవ్వబోతున్నారా

దురంధర్ షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలాంటి హడావిడి లేదు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా సందడి లేదు. రిలీజ్ ముందు ఎక్కువ నెగటివిటీనే ఉంది. కానీ ఇప్పుడు సీక్వెల్ వస్తున్న టైంలో కేవలం ప్రీమియర్ షోలతోనే రికార్డులు బద్దలు అవ్వడం చూస్తూ బాలీవుడ్ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. 35 నుంచి 45 కోట్ల దాకా అడ్వాన్స్ రావొచ్చనే అంచనా షాక్ కలిగిస్తోంది.

ఇదిలా ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు దురంధర్ రివెంజ్ తో ఈ కథ ఆగిపోవడం లేదట. మూడో భాగం ‘ది వ్రాత్ అఫ్ గాడ్’ పేరుతో ఆదిత్య ధార్ థర్డ్ పార్ట్ సిద్ధం చేస్తున్నాడని వినికిడి. దీనికి సంబంధించిన షూట్ అయ్యిందో లేదో అసలిది పుకారో నిజమో తెలియదు కానీ కార్యరూపం దాలిస్తే మాత్రం సెన్సేషన్ అవుతుంది. ఎందుకంటే పార్ట్ 3తో సక్సెసైన బాలీవుడ్ మూవీస్ లేవు.

ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందనేది మార్చి 19 ప్రీమియర్ల ఎండ్ టైటిల్స్ చూశాక క్లారిటీ వస్తుంది. అయినా ఏడున్నర గంటల కంటెంట్ ని వెబ్ సిరీస్ లా కాకుండా రెండు భాగాల థియేటర్ మూవీగా మార్చి ఇంత గొప్ప విజయాన్ని అందుకోవడానికి దారులు వేసుకోవడం ఒక్క ఆదిత్య ధార్ కే చెల్లింది. ప్రస్తుతానికి ఇంతకు మించిన వివరాలు లేవు కానీ మూవీ లవర్స్ అయితే ఎగ్జైట్ అవుతున్నారు.

ఇక దురంధర్ రివెంజ్ విషయానికి వస్తే ఆల్ టైం రికార్డులకు మార్గం సుగమం అవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ బుకింగ్స్ మతులు పోగొడుతున్నాయి. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో సైతం వేగంగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇంకా పది రోజులు ఉంది కాబట్టి రిలీజ్ నాటికి ఇంకా పెద్ద సునామీగా మారడం ఖాయం. ఇప్పటిదాకా కేవలం ప్రీమియర్ల బుకింగ్స్ మాత్రమే అందుబాటులో ఉంచారు.

ఆదిత్య ధార్ టీమ్ ప్రస్తుతానికి ఎలాంటి ప్రమోషన్లు చేయడం లేదు. ఇంటర్వ్యూలు ఇచ్చే ఉద్దేశం కూడా ఉన్నట్టు లేరు. అవును మరి పబ్లిసిటీ అవసరం లేకుండా జనం ఈ స్థాయిలో సినిమా చూసేందుకు ఉవ్విళ్ళూరుతుంటే అంతకంటే ఏం కావాలి. ఈసారి రివెంజ్ లో అక్షయ్ ఖన్నా లేడు కాబట్టి పూర్తి డామినేషన్ రణ్వీర్ సింగ్ దే ఉంటుందని అంటున్నారు. డ్యూయల్ షేడ్స్ ఉంటాయి కాబట్టి పీక్స్ పెర్ఫార్మన్స్ చూడొచ్చు.

This post was last modified on March 8, 2026 6:57 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

8 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

8 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

9 hours ago