స్టార్ హీరోలు పెద్ద సినిమాల్లో స్పెషల్ లుక్‌లో కనిపిస్తున్నడు.. ఆ లుక్ బయట పడకుండా జాగ్రత్త వహిస్తుంటారు. నెలల తరబడి బయట కనిపించరు. జూనియర్ ఎన్టీఆర్ సైతం చాన్నాళ్లుగా పబ్లిక్ అప్పీయరెన్స్ ఇవ్వలేదు. ‘డ్రాగన్’ (వర్కింగ్ టైటిల్) కోసం స్పెషల్ లుక్‌లోకి మారిన నేపథ్యంలోనే అతను బయటికి రావట్లేదన్నది స్పష్టం.
ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్ సందీప్ గుణ్ణం నిర్మాణంలో ‘మృత్యుంజయ్’ సినిమా రిలీజైనా.. తన అవసరం ఉన్నప్పటికీ వచ్చి ప్రమోట్ చేయలేదు. లుక్ రివీల్ అవుతుందన్న కారణంతోనే తారక్ ఈ సినిమా కోసం రాలేదని సందీప్ సైతం చెప్పాడు. ఐతే ఇప్పుడు తారక్ ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం బయటికి వచ్చాడు.
హైదరాబాద్‌లో బాగా ఫేమస్ అయిన కిమ్స్ హాస్పిటల్ కొత్త శాఖను బెంగళూరులో ప్రారంభించగా.. ఆ వేడుకలో తారక్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తారక్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వారిని అభివాదం చేయడానికి తారక్ కారులోంచి బయటికి వచ్చాడు. కారు మీదికి ఎక్కి అభిమానులకు అభివాదం చేశాడు.
గాగుల్స్ పెట్టుకుని.. గుబురు గడ్డంతో కనిపించిన తారక్‌ను చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. సూపర్ స్టైలిష్‌గా ఉన్న తారక్ లుక్ వారిలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఈ లుక్ తాలూకు ఫొటోలు నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి.
ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న చిత్రంలో తారక్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడని చాన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. బయట ఇప్పుడు కనిపించిన లుక్.. మేకప్, గెటప్‌తో సినిమాలో ఇంకా ఆకర్షణీయంగా ఉంటుందని చిత్ర వర్గాల సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్‌లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు కానీ.. ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on March 8, 2026 1:43 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…