కొన్ని రోజులుగా హాట్ ఫొటో ఫొటో షూట్లు, వీడియోలతో మెగా అమ్మాయి కొణిదెల నిహారిక బాగానే వార్తల్లో నిలుస్తోంది. గ్లామర్ ఫీల్డులోకి రావడానికి కుటుంబం నుంచి అనుమతి పొందడానికి ఒకప్పుడు చాలా కష్టపడ నిహారిక.. కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకునే తెరమీద ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేసింది. ఫొటో షూట్లలోనూ హద్దులు దాటలేదు. కానీ ఈ మధ్య ఆమె ఆలోచన మారినట్లుంది.
ఫొటో షూట్లతో పాటు తాజాగా చేసిన ఓ డ్యాన్సింగ్ వీడియోలోనూ హాట్ హాట్‌గా కనిపించింది. దీంతో పరోక్షంగా తాను గ్లామర్ క్యారెక్టర్లు చేయడానికి రెడీ అని చెబుతున్నట్లే ఉందింది. కానీ తెలుగులో ఆమె చేసిన మూడు సినిమాలూ డిజాస్టర్లే అయ్యాయి. ముఖ్యంగా ఆమె నుంచి వచ్చిన చివరి సినిమా ‘సూర్య కాంతం’ దారుణమైన ఫలితాన్నందుకుంది. దీంతో మెగా అమ్మాయికి తెలుగులో మరో అవకాశం దక్కడం సందేహంగానే ఉంది.
కానీ ఆశ్చర్యకరంగా ఆమెకు తమిళంలో ఓ మంచి అవకాశం దక్కడం విశేషం. అశోక్ సెల్వన్ అనే కాస్త పేరున్న హీరోతోనే ఆమె జోడీ కట్టనుంది. ఇటీవలే అశోక్ ‘ఓ మై కడవులే’ సినిమాతో కెరీర్లో పెద్ద హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో అతడికి క్రేజ్ పెరిగింది. ఓ కొత్త దర్శకురాలు రూపొందించబోయే సినిమాలో అశోక్, నిహారిక జంటగా నటించబోతున్నారని వార్తలొచ్చాయి. ఈ ప్రచారంపై నిహారిక స్పందించింది. ఆ వార్త నిజమే అని.. లాక్ డౌన్ పూర్తయి ఆ సినిమాలో ఎప్పుడెప్పుడు నటిద్దామా అని ఆత్రుతగా ఉందని చెప్పింది.
తమిళంలో నిహారిక ఇంతకుముందే ఓ పేరున్న సినిమాలో నటించింది. అందులో విజయ్ సేతుపతి కీలక పాత్ర చేశాడు. ఆ కామెడీ ఫాంటసీ మూవీ అక్కడ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో తమిళంలో కూడా నిహారికది ఫ్లాప్ ఎంట్రీనే అయింది. ఐతే తెలుగులో ఇంత బ్యాగ్రౌండ్ ఉండి సినిమాలు లేని నిహారికకు తమిళంలో రెండో అవకాశం రావడం ఆశ్చర్యమే.
This post was last modified on May 4, 2020 10:16 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…