Movie News

ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే ట్విస్టులు

పెద్దగా హడావిడి చేయకుండా, సైలెంటుగా షూటింగ్ జరుపుకుంటున్న క్రేజీ సినిమాల్లో ఆదర్శ కుటుంబం ఒకటి. వెంకటేష్, శ్రీనిధి శెట్టి జంటగా నటిస్తున్న ఈ మూవీకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రేకుల్లేకుండా ప్లానింగ్ కు అనుగుణంగా షూట్ చేసేస్తున్నారు. అక్టోబర్ రెండు విడుదలని టార్గెట్ గా పెట్టుకున్నట్టు టాక్ ఉంది కానీ దీన్ని ఇప్పట్లో అధికారికంగా ప్రకటించకపోవచ్చు. వేసవి నుంచి ప్రమోషనల్ అప్డేట్స్ వదలాలని నిర్ణయించుకున్నారట.

ఇది పక్కనపెడితే పైకి టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా క్యాప్షన్ లో ఉన్న ఏకే 47కు తగ్గట్టు ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ బలంగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. ఇంటర్వెల్ వరకు సరదాగా సాగుతూ, మల్లీశ్వరి – నువ్వు నాకు నచ్చావ్ తరహాలో ఫన్ నడిపిస్తూ ఒక్కసారిగా ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర పెద్ద మలుపు పెట్టారని వినికిడి. ఇక్కడి నుంచి కథా గమనం మారిపోయి మహేష్ బాబు అతడు తరహా ట్రీట్ మెంట్ తో మాటల మాంత్రికుడు మరోసారి తనదైన మార్కు బయటకి తీస్తారని యూనిట్ లీక్.

గుంటూరు కారంలో జరిగిన పొరపాట్లకు ఈసారి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అల వైకుంఠపురములో ప్లస్ అతడుని కలగలిపి దానికి వెంకీ మార్కు టైమింగ్ జోడిస్తే అదే ఆదర్శ కుటుంబం అంటున్నారు. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా రూపొందుతోందట. ఈ కాంబో కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూసిన మూవీ లవర్స్ కోరికకు అనుగుణంగా పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ వస్తోందని అంటున్నారు. త్రివిక్రమ్ కు ఆదర్శ కుటుంబం బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం.

ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి బజ్ మరింత పెరగాలంటే దీంతో అదిరిపోయే హిట్టు కొట్టాలి. గాడ్ అఫ్ వార్ (ప్రచారంలో ఉన్న టైటిల్) జూనియర్ ఎన్టీఆరా లేక అల్లు అర్జునా అనే ప్రచారానికి ఇంకా చెక్ పడలేదు కానీ మే నెలలో తారక్ పుట్టినరోజు సందర్భంగా ఒక క్లారిటీ రావొచ్చని అంటున్నారు. యానిమల్, అర్జున్ రెడ్డి ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్న ఈ యాక్షన్ కం ఫ్యామిలీ డ్రామాలో మ్యూజిక్ కూడా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందట.

This post was last modified on March 6, 2026 3:54 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

1 hour ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago