Political News

స్వామివారి చెంతనా మీ కీచులాట?

దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా నిర్వహించే పవిత్ర కార్యక్రమం. అలాంటి వేడుకల్లో రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణంలో దైవనామ స్మరణ తప్ప మరే వివాదానికీ స్థానం ఉండకూడదని పెద్దలు చెప్పే మాటలు తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో జరిగిన ఘటనతో మరోసారి చర్చకు వచ్చాయి.

నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కల్యాణోత్సవ వేడుకల్లో పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య ఇప్పటికే నెలకొన్న విభేదాలు ఈ సందర్భంలో బహిర్గతమయ్యాయి.

సోమవారం రాత్రి జరిగిన వేణుగోపాలస్వామి కల్యాణోత్సవానికి ఎంపీ సతీసమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కూడా దంపతులతో కలిసి కార్యక్రమానికి విచ్చేశారు. స్వామి కల్యాణ మండపానికి ఎదురుగా రుక్మిణి, సత్యభామ విగ్రహాల సమీపంలో పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను ఎంపీ దంపతులకు అందజేశారు. అదే సమయంలో మరో వైపున ఉన్న ఎమ్మెల్యే తనకూ పట్టు వస్త్రాలు ఇవ్వాలని కోరుతూ చేతులు చాచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఒకరికే పట్టు వస్త్రాలు సమర్పించే ఆనవాయితీ ఉండటంతో పురోహితులు అసౌకర్యానికి గురయ్యారు. ఎమ్మెల్యే దంపతులకు ప్రత్యామ్నాయంగా తలంబ్రాలు అందజేశారు. అయితే ఎంపీకి పట్టు వస్త్రాలు అందజేయడం ఎమ్మెల్యేకు నచ్చలేదు. వెంటనే ఎంపీ చేతిలోని వస్త్రాలను లాక్కుని తన తలపై ఉంచుకుని కల్యాణ మండపం వైపు నడిచారు. ఈ చర్యతో అక్కడికక్కడే ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ అనుచరులు తిరిగి వస్త్రాలు తీసుకునేందుకు ప్రయత్నించగా కొంతసేపు గందరగోళం ఏర్పడింది.

ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నాయి. అధిష్టానం జోక్యం చేసుకొని సర్ది చెప్పినప్పటికీ కొలిక్కి రావడం లేదు. ఇప్పుడు తాజాగా జరిగిన సంఘటన రాజకీయ విభేదాలను బయటపెట్టింది.

This post was last modified on March 3, 2026 11:19 am

Share

Recent Posts

సరైన పుకారు ఎవరు సృష్టించారు

సరైనోడు ఇచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శీను కాంబోలో ఒక సినిమా తెరకెక్కే అవకాశముందంటూ నిన్న…

11 minutes ago

రాకాతో ఆస్కార్ కొట్టి త‌మిళంలో మాట్లాడ‌తా

ఒక‌ప్పుడు ఆస్కార్ అవార్డుల గురించి ఇండియ‌న్ ఫిలిం మేక‌ర్స్ ఆలోచించ‌డం కూడా క‌ష్టంగా ఉండేది. కానీ ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత…

3 hours ago

టీనేజ్ ప్రేమలు కాసులు కురిపిస్తాయా

మొన్న గాంధీ జయంతికి విడుదలైన సినిమాల్లో బడ్జెట్ తక్కువే అయినా తెల్లకాగితం అంతో ఇంతో సౌండ్ చేయడంలో సక్సెసయ్యింది. వీడియోలు…

4 hours ago

మంట‌లు రేపుతున్న `ఫాం-6..`

కొత్త‌గా ఓటు న‌మోదు చేసుకోవాల‌ని అనుకునేవారు.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెబ్ సైట్ లేదా..అధికారుల నుంచి ఫాం-6ను తీసుకుని దానిని…

4 hours ago

అఖండ-3 నిజంగా సాధ్యమేనా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య చాలా ఏళ్ల…

9 hours ago

మరో విమానంలో సీరియస్ సిగ్నల్స్

విమానాలు భయపెడుతున్నాయి. గత వారం ఫ్లై దుబాయ్ విమానాన్ని కూల్చివేసేందుకు కో పైలట్ ప్రయత్నం చేయడం ప్రపంచ వ్యాప్తంగా వార్తయ్యింది.…

10 hours ago