Movie News

క్లిక్ అయితే శ్రీవిష్ణు పంట పండినట్టే

రేపు విష్ణు విన్యాసం విడుదల కానుంది. కొత్త రిలీజులు ఇంకేం ఉన్నాయనేది పక్కనపెడితే జనాల దృష్టిలో అంతో ఇంతో ఫోకస్ తెచ్చుకున్న మూవీ ఇదే. సింగల్ తర్వాత శ్రీవిష్ణు మళ్ళీ తెరమీద కనిపించలేదు. నారి నారి నడుమ మురారిలో చిన్న క్యామియో చేశాడు కానీ అది కౌంట్ లోకి రాదు.

రాజ రాజా చోర టైంలో చూపించిన కాన్ఫిడెన్స్ ని మళ్ళీ అదే స్థాయిలో వ్యక్తం చేయడం చూస్తుంటే కంటెంట్ బాగానే వచ్చినట్టు అనిపిస్తోంది. యూత్ ని టార్గెట్ చేసుకున్న ట్రైలర్ వాళ్లలో అంచనాలు రేపడంలో సక్సెసయ్యింది. ఫ్యామిలీస్ ఇంకా ఏ మేరకు టర్న్ అవుతారనేది రేపు ఉదయం టాక్, రివ్యూలను బట్టి ఉంటుంది.

విష్ణు పంట పండినట్టే అని హెడ్డింగ్ పెట్టడానికి కారణం ఉంది. ఏపీ తెలంగాణలోనే కాదు అటు ఓవర్సీస్ లోనూ తెలుగు జనాలకు సరైన సినిమా లేక థియేటర్లకు దూరంగా ఉంటున్నారు. ఓ మోస్తరుగా కపుల్ ఫ్రెండ్లీ బండి లాగింది కానీ దాని ప్రభావం ఏ సెంటర్లకే పరిమితమయ్యింది. హడావిడి చేసిన ఫంకీ, హే బలవంత్ మొదటి వీకెండ్ కే చేతులు ఎత్తేశాయి.

సీత పయనం లాంటి వాటి గురించి చెప్పాల్సిన పని లేదు. సో నెల రోజులకు పైగానే బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంటోంది. ఉదయం నిద్రలేచే థియేటర్ యజమాని ఆ రోజు ఎన్ని షోలు పడతాయో, ఎన్ని క్యాన్సిల్ అవుతాయో ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో విష్ణు విన్యాసం కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పబ్లిక్ కు ఉన్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ గా మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చు. ఒకవేళ యునానిమస్ వస్తే మాత్రం కెరీర్ బెస్ట్ నమోదు అయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. పబ్లిసిటీ పరంగా ఎంత చేయాలో అంతా చేస్తున్నారు.

కేవలం వారం గ్యాప్ లో మార్చి 6 శ్రీవిష్ణు మరో సినిమా మృత్యుంజయ్ వస్తున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఫస్ట్ వీక్ నే టార్గెట్ గా పెట్టుకుంది టీమ్. ఇంటర్, పది పరీక్షల వల్ల ఆక్యుపెన్సీలు కొంత ప్రభావితం చెందుతున్నా యూత్ అండ్ మాస్ ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు రెడీగా ఉన్నారు. విన్యాసాలు వాళ్ళను మెప్పిస్తే చాలు.

This post was last modified on February 26, 2026 1:42 pm

Share

Recent Posts

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

1 hour ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

2 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

4 hours ago

సోషల్ మీడియా ట్రోల్స్ నుంచి సైరా పోలిక దాకా

అక్టోబర్ 16 విడుదల కాబోతున్న రణబాలి మీద సోషల్ మీడియా డిస్కషన్లు చూస్తున్నాం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నని టార్గెట్…

8 hours ago

బాలకృష్ణ – తమన్… ఆరేళ్ల నుంచి గ్యాప్ లేదు

బాలకృష్ణ, తమన్.. అఖండ సినిమాతో మొదలైన ఈ కాంబో అలా కంటిన్యూ అవుతూనే ఉంది. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు…

9 hours ago

తెల్లదొరల అరాచకంపై ‘రణబాలి’ రణం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న రణబాలి…

10 hours ago