Movie News

తమన్ నోరు జారి సరిచేసుకున్నా…

ఈ రోజుల్లో స్టేజ్ మీద కొంచెం మాట అటు ఇటు అయితే ఎంత పెద్ద వివాదాలు చెల‌రేగుతున్నాయో తెలిసిందే. సీనియ‌ర్ న‌టుడు శివాజీ రెండు నెల‌ల ముందు ఇలా నోరు జారి తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు. చాలా రోజుల పాటు ఆ వివాదం న‌డిచింది.

మాట‌ల ఫ్లోలో ఏదో అనేసి.. ఆ త‌ర్వాత నాలుక క‌రుచుకోవ‌డం, సారీ చెప్ప‌డం, త‌మ‌ మాట‌ల్ని వ‌క్రీక‌రించార‌ని పేర్కొన‌డం, త‌మ‌ ఉద్దేశం వేర‌ని మాట మార్చ‌డం.. ఇలా చాలా జ‌రుగుతుంటాయి. సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ బ్యాండ్ మేళం అనే చిన్న సినిమా ఈవెంట్లో ఒక మాట పొర‌పాటుగా మాట్లాడి.. వెంట‌నే స‌ర్దుకున్నాడు. ఇదేదో వివాదం అవుతుంద‌ని త‌క్ష‌ణం గ్ర‌హించి క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

కోర్టు సినిమాలో ముఖ్య పాత్ర‌లు పోషించిన టీనేజీ ఆర్టిస్టులు రోష‌న్, శ్రీదేవి.. బ్యాండ్ మేళంలో లీడ్ రోల్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. కోర్టు సినిమా త‌ర‌హాలోనే ఈ మూవీలోనూ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వీరి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండిన సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

బ్యాండ్ మేళం టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌కు అతిథిగా హాజ‌రైన త‌మ‌న్ ఇదే విష‌యం గురించి మాట్లాడుతూ.. మీ ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ ఫిజిక్స్‌గా మార‌కుండా చూసుకోండి అన‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. రోష‌న్, శ్రీదేవి సైతం అంత మాట అనేశాడేంటి అన్న‌ట్లు ఆశ్చ‌ర్య‌పోతూ న‌వ్వుకున్నారు. ఆడిటోరియంలో కూడా కుర్రాళ్లు గ‌ట్టిగా అరిచారు.

ఐతే తాను నోరు జారాన‌ని వెంట‌నే అర్థం చేసుకున్న త‌మ‌న్… త‌న మాట‌ల‌ను క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. త‌న ఉద్దేశం ఇద్ద‌రూ గొడ‌వ‌ప‌డ‌కుండా మంచిగా ఉండాల‌నే అని.. చాలా దూరం ప్ర‌యాణించాల్సిన వాళ్లు గొడ‌వ‌లు ప‌డ‌కూడ‌ద‌నే అని వ్యాఖ్యానించాడు.

అయినా కుర్రాళ్లు అరుస్తుంటే.. మీరు ఇంకోలా అనుకోకండి, నేను పెద్ద‌గా చ‌దువుకోలేదు. ఐదో క్లాస్ ఫెయిల‌య్యాను. నాకు జువాల‌జీ అదీ ఏమీ తెలియ‌దు అంటూ త‌మ‌న్ కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. అయినప్పటికీ అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అటువంటి మాట మాట్లాడకుండా ఉండవల్సిందని.. సోషల్ మీడియా యుగంలో డ్యామేజ్ చెయ్యడానికి ఆ ఒక్క మాట చాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

This post was last modified on February 25, 2026 1:54 pm

Share

Recent Posts

జైలర్‌ 2 అంచనాల బరువు తగ్గిందా

ఇంకో మూడు రోజుల్లో జైలర్ 2 విడుదల కానుంది. నైజామ్ అడ్వాన్స్ బుకింగ్ మొదలైపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్…

49 minutes ago

డ్యూడ్ హీరో… మోదీనే పొమ్మన్నాడుగా

ఎవరి జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చెప్పలేం. ఫేమ్ లేనపుడు చేసే కొన్ని పనులు.. తర్వాత అనుకోని ఇబ్బందిగా…

52 minutes ago

అందరికీ అది… రాజమౌళికి మాత్రం ఇదే

రాజమౌళి కెరీర్‌ను అతి పెద్ద మలుపు తిప్పిన సినిమాగా అందరూ ‘బాహుబలి’నే చెబుతారు. ఆయన కెరీర్‌ను ‘బాహుబలి’కి ముందు, తర్వాత…

55 minutes ago

ఈ దెబ్బతో గొడ్డలి పార్టీ మూతపడాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…

2 hours ago

ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…

2 hours ago

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

4 hours ago