దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్ కోసమని అర్థమవుతున్నా దాని వెనుక మరో కోణం కనిపిస్తోంది. గత రెండు మూడు రోజులుగా కొందరు నెటిజెన్లు సత్య, దురంధర్ మధ్య ఉన్న కొన్ని దగ్గర పోలికలను వీడియోల రూపంలో కట్ చేసి ఎక్స్, ఇన్స్ టాలో వైరల్ చేస్తున్నారు.
చూస్తే నిజంగా ఆదిత్య ధార్ చాలా విషయాల్లో సత్యని ఇన్స్ పిరేషన్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అది కొంత వరకు మాత్రమే నిజం. ఎందుకంటే దురంధర్ దర్శకుడికి టేకింగ్ పరంగా స్ఫూర్తినిచ్చిన వాళ్ళలో వర్మతో పాటు ఎందరో సౌత్, నార్త్ కల్ట్ దర్శకులు ఉన్నారు.
సత్యలో చూపించిన హీరో, అతని స్నేహితుడు, స్వార్థంతో కుట్రలు చేసే రాజకీయ నాయకుడు, మాఫియాని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న పోలీస్ ఆఫీసర్, విలన్ గ్యాంగ్ లో ఉండే కొందరు హీరోకి స్నేహితులుగా మారడం ఇవన్నీ దురంధర్ లో కూడా ఉన్నాయి.
అయితే కేవలం ఈ ప్రాతిపదికన రెండు ఒకటేనని లేదా స్ఫూర్తి చెందారని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ చెప్పిన క్యారెక్టర్లన్నీ దాదాపు అన్ని గ్యాంగ్ డ్రామాల్లో ఉంటాయి. అమితాబ్ బచ్చన్ డాన్, కమల్ హాసన్ నాయకుడు నుంచి పవన్ కళ్యాణ్ ఓజి దాకా వందల ఉదాహరణలు చెప్పొచ్చు. అంతమాత్రాన అన్నింటికి కాపీ ముద్ర వేయలేం.
సో ఊరికే హడావిడి తప్ప సత్య, దురంధర్ రెండు వేర్వేరు జానర్లకు సంబంధించిన క్లాసిక్ కంటెంట్లు. దురంధర్ 2 మీద అందుకే అంత పెద్ద స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. వర్మ ఇప్పుడు పొగిడినా పొగడకపోయినా దాని ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో రావడం ఖాయం.
హైప్ కు తగ్గట్టు సినిమా ఉంటే పుష్ప 2ని టార్గెట్ చేయడం కూడా కన్ఫర్మ్. కాకపోతే ఊరికే పాత సినిమాలన్నీ తవ్వి ఇలా డిస్కషన్లు పెట్టడం అనేది కొన్ని హ్యాండిల్స్ రీచ్ కోసం చేస్తున్నాయి కానీ మూవీ లవర్స్ కి దేని గొప్పదనం ఎంతో పూర్తి అవగాహన ఉంది. మార్చి 19 విడుదల కాబోతున్న దురంధర్ 2 రివెంజ్ ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates