బ‌న్నీ సినిమా గురించి బాసిల్ జోసెఫ్‌ను అడిగితే…

మ‌ల‌యాళంలో గ‌త కొన్నేళ్ల‌లో మోస్ట్ ల‌వ్డ్ యాక్ట‌ర్‌గా ఎదిగాడు బాసిల్ జోసెఫ్‌. డ‌బ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా అత‌ను బాగానే ప‌రిచ‌యం. ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌కు ద‌ర్శ‌కుడిగా కూడా మంచి గుర్తింపే ఉంది. టొవినో థామ‌స్ హీరోగా అత‌ను రూపొందించిన మిన్న‌ల్ ముర‌ళి ఓటీటీలో బ్లాక్ బ‌స్ట‌ర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. 

దాని కంటే ముందు కూడా రెండు సినిమాలు తీసిన బాసిల్.. మిన్న‌ల్ ముర‌ళి త‌ర్వాత మ‌రో సినిమాను డైరెక్ట్ చేయ‌క‌పోవ‌డం త‌న అభిమానుల‌కు నిరాశ కలిగించే విష‌య‌మే. కానీ ద‌ర్శ‌కుడిగా త‌న త‌ర్వాతి చిత్రాన్ని అల్లు అర్జున్ లాంటి సూప‌ర్ స్టార్‌తో చేస్తాడ‌ని వార్త‌లు రావ‌డం ఎగ్జైట్ చేసింది. శ‌క్తిమాన్ త‌ర‌హా క‌థ‌తో ఈ సినిమా ఉంటుంద‌ని గ‌త ఏడాది జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్ప‌టిదాకా ఆ సినిమా గురించి అప్‌డేట్ అయితే లేదు.

తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో బాసిల్ జోసెఫ్‌ను బ‌న్నీ సినిమా గురించి అడిగితే.. అత‌ను ఔన‌ని అన‌లేదు, అలా అని కాద‌ని కూడా చెప్ప‌లేదు. బ‌న్నీ 25వ సినిమా మీ ద‌ర్శ‌క‌త్వంలోనే అట క‌దా, అది శ‌క్తిమాన్ క‌థతో తెర‌కెక్కుతోంద‌ట క‌దా అని అడిగితే.. బాసిల్ న‌వ్వేశాడు. జ‌ర‌గాల్సిన‌వి ఎప్పుడు జ‌ర‌గాలో అప్పుడు జ‌రుగుతాయ‌ని.. వాటిని అలా జ‌ర‌గ‌నివ్వాల‌ని, అంతే త‌ప్ప ముందే మాట్లాడ‌కూడ‌ద‌ని బాసిల్ అన్నాడు. 

ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది, క‌థ శ‌క్తిమాన్ త‌ర‌హాలో ఉంటుందా అని అంటే.. ఏదీ తాను చెప్ప‌లేన‌ని.. మిగ‌తా సినిమాల ప్లానింగ్‌లా ఆ ప్రాజెక్టును ప్లాన్ చేయ‌డం సాధ్యం కాద‌ని.. అదొక ప్రాస‌స్ అని, చాలా టైం ప‌డుతుంద‌ని, ఎంతో అనిశ్చితి ఉంటుంద‌ని.. కాబ‌ట్టి ఏదైనా జ‌రిగాక ఇది జ‌రిగింది అని చెప్ప‌గ‌ల‌నే త‌ప్ప ఇప్పుడు బ‌న్నీతో సినిమా గురించి ఇప్పుడేమీ చెప్ప‌లేన‌ని బాసిల్ స్ప‌ష్టం చేశాడు.

బాసిల్ మాటల్ని బట్టి చూస్తే అతడి దర్శకత్వంలో బన్నీతో సినిమా కోసం సంప్రదింపులు జరుగుతున్న మాట వాస్తవమే కానీ.. ఈ ప్రాజెక్ట్ 100 పర్సంట్ ఫైనలైజ్ కాలేదని అర్థమవుతోంది. ఐతే ఈ కాంబోలో సినిమా రావడానికి స్కోప్ అయితే ఉందన్నది కూడా వాస్తవం. ప్రస్తుతం రాకా మూవీ చేస్తున్న బన్నీ.. లోకేష్ కనకరాజ్, బోయపాటి సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.