Movie News

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే కాక దక్షిణాది సినీ ప్రేక్షకులందరినీ ఎంతో ఉత్సాహానికి, ఉద్వేగానికి గురి చేస్తోంది. కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు.

నిన్న రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రోమో భలేగా అనిపించింది.
రజినీ, కమల్ మంచి మిత్రులైనప్పటికీ.. వారి మధ్య దశాబ్దాలుగా వృత్తిపరమైన పోటీ ఉంది. అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ సంగతీ చెప్పాల్సిన పని లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ప్రోమోలో ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు వ్యవహరించారు. అసలీ సినిమాలో హీరో ఎవరో చెప్పాలంటూ ఇద్దరు దర్శకుడు నెల్సన్‌ను ఇరుకున పెట్టేలా ప్రశ్నలు కూడా సంధించారు. కానీ ఆ ప్రశ్నకు ప్రోమోలో జవాబు మాత్రం ఇవ్వలేదు.

ఐతే ఈ చిత్రంలో రజినీకాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తుండొచ్చు అనే చర్చ జరుగుతోంది. రజినీ, కమల్ ఇద్దరూ నెగెటివ్ రోల్స్ చేయడంలో ఎవరికి వాళ్లే సాటి. కెరీర్ ఆరంభంలో రజినీ విలన్ పాత్రలు చాలానే చేశాడు. ‘రోబో’ సినిమాలో నెగెటివ్ షేడ్స్‌ను అద్భుతంగా పండించాడు.

ఇక కమల్ ‘అభయ్’ సినిమాలో హీరోగా, విలన్‌గా నటించాడు. ‘కల్కి’ చిత్రంలోనూ విలన్ పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఐతే కమల్‌ను మించి రజినీనే నెగెటివ్ క్యారెక్టర్‌ను బాగా చేయగలడన్నది స్పష్టం. అందుకే ఆయన పాత్రను కొంచెం నెగెటివ్ షేడ్స్‌తో తీర్చిదిద్ది ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రోమోలో ముందుగా కమల్‌ను చూపించి, పేరు కూడా తనదే ముందు వేయడం కూడా ఈ అనుమానాలను బలపరుస్తోంది. ఐతే బాల నటుడిగా ఐదేళ్ల వయసు నుంచే సినిమాలు చేయడం ద్వారా నటనలో రజినీ కంటే కమలే సీనియర్ కాబట్టి ఆయన పేరు ముందు వేసి ఉండొచ్చు, ఆయన్నే ముందు చూపించి ఉండొచ్చని.. అంతమాత్రాన ఆయనే హీరో అని.. రజినీ విలన్ అని ఒక అభిప్రాయానికి రావడం కూడా కరెక్ట్ కాదనే వాదన కూడా వినిపిస్తోంది.

ఐతే ప్రోమో ద్వారా మూవీలో ఒక్కరే హీరోనా.. లేక ఇద్దరూ హీరోలుగానే కనిపించనున్నారా అనే చర్చను లేవనెత్తి ఈ సినిమాకు ఆరంభంలోనే కావాల్సినంత బజ్ తీసుకొచ్చాడు నెల్సన్.

This post was last modified on February 22, 2026 12:42 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

2 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

4 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

9 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

10 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

10 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

10 hours ago