ముందు క్యారెక్టర్ రోల్స్ చేశాడు. తర్వాత హీరోగా మారి ‘కలర్ ఫొటో’తో మెప్పించాడు. అప్పట్నుంచి వరుసగా లీడ్ రోల్స్‌లో సినిమాలు చేస్తున్నాడు. దాంతో పాటు అప్పుడప్పుడూ క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్‌లోనూ మెరుస్తున్నాడు సుహాస్. షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ స్థాయికి చేరుకున్న తన ప్రయాణం స్ఫూర్తిదాయకం.
ఐతే ఇలా కష్టపడి ఎదిగిన ఆర్టిస్టులకు కెరీర్ ఆరంభంలో కొన్ని చేదు అనుభవాలు తప్పకుండా ఉంటాయి. తానూ అందుకు మినహాయింపు కాదంటున్నాడు సుహాస్. తనకు గతంలో ఎదురైన ఒక అవమానం గురించి తన కొత్త సినిమా ‘హే బల్వంత్’ ప్రమోషనల్ ఈవెంట్లో సుహాస్ వెల్లడించాడు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుహాస్‌కు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా ‘మజిలీ’. ఆ సినిమాతో తన కెరీర్ మారిందని.. వరుసగా అవకాశాలు వచ్చాయని చెప్పిన సుహాస్.. ఒక సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం తనను పిలిస్తే అక్కడ ఎదురైన అనుభవం గురించి గుర్తు చేసుకున్నాడు.
‘హీరోయిన్‌కు చాలా క్లోజ్‌గా ఉండే క్యారెక్టర్, ఇతణ్నెందుకు పిలిచారు’ అంటూ అక్కడున్న ఓ వ్యక్తి తన ముందే అన్నట్లు సుహాస్ తెలిపాడు. అప్పుడు చాలా బాధ పడ్డానన్న సుహాస్.. కొన్నేళ్ల తర్వాత కీర్తి సురేష్, సుహాస్ కాంబినేషన్లో ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా వచ్చిందని.. తన దృష్టిలో ఇదే పెద్ద సక్సెస్ అని చెప్పుకొచ్చాడు.
కీర్తి సురేష్‌కు తనతో పాటు తన భార్య కూడా పెద్ద అభిమాని అని.. ‘ఉప్పు కప్పురంబు’ సినిమా షూట్ తొలి రోజు ఆమె తనను ‘హాయ్ సుహాస్’ అని పలకరించి, హగ్ ఇవ్వడం ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు సుహాస్.
ఆ షూట్ జరిగినన్ని రోజులు తన భార్య అనేక రకాల వంటలు చేసి పంపేదని.. అవి కీర్తి సురేష్‌కు వడ్డించేవాడినని సుహస్ తెలిపాడు. కీర్తి గురించి ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం చూస్తే.. గతంలో అతడికి అవమానం ఎదురైంది కీర్తి నటించిన సినిమానే అయ్యుండొచ్చనే సందేహాలు కలుగుతున్నాయి. మరి ఆ చిత్రం ఏదో?
This post was last modified on February 18, 2026 2:18 pm
మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…