రాజకీయాల్లో చేదు అనుభవం చవిచూసి తిరిగి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవికి రీఎంట్రీలో అన్నీ దగ్గరుండి సెట్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఖైదీ నంబర్ 150, సైరా చిత్రాలను స్వీయ నిర్మాణంలో తీసాడు. సైరా చిత్రానికి సురేందర్ రెడ్డిని దర్శకుడిగా ఎంచుకోవడం నుంచి పలు విషయాలపై చరణ్ చాలా శ్రద్ధ పెట్టాడు. అలాగే కొరటాల శివతో ఆచార్య సినిమా సెట్ అవడంలోను చరణ్ పాత్ర చాలా వుంది. చిరంజీవితో ఇప్పటి హాట్‍షాట్ డైరెక్టర్ సినిమా చేస్తే బాగుంటుందని చరణ్ ఈ ప్రాజెక్ట్ ఓకే చేయించాడు.
అంతే కాకుండా అందులో ఒక కీలక పాత్ర చేయడానికి కూడా అంగీకరించాడు. లూసిఫర్ సినిమా చూసి రైట్స్ తీసుకున్న చరణ్ అప్పట్లో తనకో కథ చెప్పడానికి వచ్చిన సుజీత్‍కి రీమేక్ బాధ్యతలు అప్పగించాడు. అతడు అనుకున్న మార్పు చేర్పులు చేయలేకపోతే వినాయక్ చేతిలో స్క్రిప్ట్ పెట్టాడు.
అతడు కూడా చిరంజీవికి అనుగుణంగా మార్పులు చేయకపోవడంతో తమిళ దర్శకుడు మోహన్ రాజాని పిలిపించాడు. ధృవ ఒరిజినల్‍ని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా అప్పట్లో చరణ్‍ని కలిసి డైరెక్ట్ తెలుగు సినిమా చేయడం కోసం కథ చెప్పాడు. ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు కానీ అతడిని డాడీ వైపు చరణ్ డైవర్ట్ చేసేసాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates