Movie News

సినిమా ఏదైనా సంక్రాంతే టార్గెట్

టాలీవుడ్లో ముందు నుంచీ సంక్రాంతి అంటే యమ క్రేజ్ అన్న సంగతి తెలిసిందే. చాలా ముందుగానే ఆ సీజన్ కోసం బెర్తులు బుక్ అవుతుంటాయి. ప్రతి సంవత్సరం కనీసం అరడజను సినిమాలైనా కర్చీఫ్ వేస్తుంటాయి. చివరికి మూణ్నాలుగు సినిమాలు రిలీజవుతుంటాయి. ఐతే ఈసారి ఏకంగా ఐదు తెలుగు సినిమాలు పండక్కి రిలీజయ్యాయి.

గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ఈ సంవత్సరం ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి ఫ్యామిలీ మూవీస్ సాధించిన వసూళ్లు చూశాక ఈ సీజన్‌కు క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలు కూడా వాటి స్థాయికి మించే వసూళ్లు రాబట్టాయి. వేరే సమయాల్లో అయితేే ఈ చిత్రాలు ఏవీ కూడా ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టేవి కావన్నది స్పష్టం. అందుకే సంక్రాంతి మీద మోజు టాలీవుడ్ ఫిలిం మేకర్స్‌లో ఇంకా పెరిగిపోయింది.

గతంలో సంక్రాంతికి ఆరేడు నెలల ముందు సినిమాలు రేసులోకి వచ్చేవి. కానీ ఈసారి ఏడాది ముందే ఆ పండుగ లక్ష్యంగా కర్చీఫ్‌లు వేయడం మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి మరోసారి సంక్రాంతి రేసులో నిలుస్తారని.. బాబీ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఆ పండక్కే వస్తుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

అలాగే వెంకటేష్‌త్ అనిల్ రావిపూడి కొత్త చిత్రం కూడా సంక్రాంతి పండక్కే అంటున్నారు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలయ్య చేయనున్న సినిమా టార్గెట్ కూడా సంక్రాంతే అనే వార్తలు వచ్చాయి. ఇంతలో నాగార్జున.. ‘వాసివాడి తస్సాదియ్యా’ పేరుతో సంక్రాంతి సినిమా చేస్తున్నాడు. 

మరోవైపు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసే సినిమా కూడా సంక్రాంతికే అంటున్నారు. శర్వానంద్ తాను మళ్లీ సంక్రాంతికి వస్తానని ప్రకటించాడు. తాజాగా ‘సంక్రాంతి శుభాకాంక్షలు’ అంటూ నితిన్ ఓ పండుగ సినిమా కోసం సన్నద్ధమవుతున్నట్లు కొత్త కబురు వినిపిస్తోంది. ఇంకో రెండు మూడు సినిమాలు కూడా పండుగ టార్గెట్‌తో రెడీ అవుతున్నట్లుగా చర్చ జరుగుతోంది.

మొత్తంగా ప్రస్తుతానికి పది సినిమాల దాకా సంక్రాంతి టార్గెట్‌గా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఐతే ఇన్నాళ్లూ సంక్రాంతి అంటే ఉన్న మోజు కాస్తా.. ఇప్పుడు వేలం వెర్రిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఐతే ఇప్పుడు కర్చీఫ్‌లు అయితే వేస్తున్నారు కానీ.. వీటిలో చివరికి పోటీలో ఎన్ని మిగులుతాయో చూడాలి.

This post was last modified on February 13, 2026 8:50 am

Share

Recent Posts

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

14 minutes ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

4 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

4 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

6 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

7 hours ago

విజయ్ చెప్పింది ప్రాక్టికల్‌గా సాధ్యమేనా

రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…

7 hours ago