Movie News

ఫీడ్ బ్యాక్ విశ్లేషణలో స్వయంభు బిజీ

నిన్న నిఖిల్ సిద్దార్థ స్వయంభు రెండు నిమిషాల టీజర్ వచ్చాక సోషల్ మీడియా రియాక్షన్లు అన్ని రకాలుగా ఉన్నాయి. ఈ ప్యాన్ ఇండియా మూవీ కోసం నిఖిల్ రెండు సంవత్సరాలకు పైగా సమయాన్ని ఖర్చు పెట్టాడు. మధ్యలో ఎన్ని ఆఫర్లు వచ్చినా వాటిని హోల్డ్ లో పెట్టి పూర్తిగా దీనికే అంకితమైపోయాడు.

దర్శకుడు భరత్ కృష్ణమాచారి మీద నమ్మకంతో శారీరకంగానూ ఎంతో శ్రమ తీసుకున్నాడు. అయితే నెటిజెన్లలో కొందరికి బాహుబలి షేడ్స్ కనిపించడం, ఎడిటింగ్ లో జరిగిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల కథ గురించి అవగాహన ఇంకోలా రావడం తదితర పరిణామాలు కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ తీసుకొచ్చాయి.

విజువల్ గ్రాండియర్ నెస్ కి ఎలాంటి లోటు లేకపోయినా మరీ శల్యపరీక్ష చేసే బ్యాచులు ఎక్స్, ఇన్స్ టాలో బోలెడు ఉన్నాయి కాబట్టి అవి ఏమేం చెప్పాయనే దాని మీద స్వయంభు టీమ్ విశ్లేషణ చేస్తోందట. ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండకుండా రాబోయే ప్రమోషన్ మెటీరియల్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవి ఉపయోగపడతాయి కాబట్టి, దానికి అనుగుణంగా వాటిని పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు.

సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటించిన ఈ ఎపిక్ డ్రామా రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అయితేనే సీక్వెల్ కు సరిపడా హైప్ నెలకొంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండక తప్పదు.

కార్తికేయ 2 ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించాక మళ్ళీ దాన్ని నిలబెట్టే సినిమా నిఖిల్ నుంచి రాలేదు. అందుకే స్వయంభు విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందరూ అనుకున్నట్టు ఇది కల్పిత కథ కాదట. నిజంగా జరిగిన దాన్ని ఇతిహాసాల నుంచి తీసుకుని స్క్రిప్ట్ రాసుకున్నారు.

యుద్ధ వీరుడిగా నిఖిల్ చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. తన మార్కెట్, ఇమేజ్ కి మించి పెద్ద రిస్క్ చేశాడు కాబట్టి దానికి అనుగుణంగా ఫలితం రావాలంటే యునానిమస్ బ్లాక్ బస్టర్ సాధించాలి. టీమ్ అయితే ఆ నమ్మకంతోనే ఉంది. ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న స్వయంభుకి పబ్లిసిటీని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

This post was last modified on February 12, 2026 10:14 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

5 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

5 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

7 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

7 hours ago