మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు మరోసారి వార్తల్లో నిలిచారు. గుంటూరు కోర్టుకు తరలిస్తుండగా పోలీసు వ్యాన్‌లో నుంచే ‘పుష్ప’ సినిమా స్టైల్లో “తగ్గేదే లే” అంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా టిక్కెట్ల అవినీతి కేసు విచారణలో భాగంగా అంబటిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్‌పై గుంటూరు కోర్టుకు పోలీసులు తీసుకువచ్చారు. కోర్టు ప్రాంగణానికి చేరుకున్న సమయంలో వ్యాన్ దిగే ముందు కిటికీలోంచి గెడ్డం కింద చేయి పెట్టి అల్లు అర్జున్ తరహాలో ‘తగ్గేదే లే’ మేనరిజం ప్రదర్శించడం అక్కడున్నవారిని ఆకర్షించింది.
ఆయన చూపిన ఈ మాస్ యాటిట్యూడ్‌పై పార్టీ కార్యకర్తలు ఉత్సాహం వ్యక్తం చేస్తుండగా, నెటిజన్లు మాత్రం విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ధైర్యానికి సంకేతమంటుంటే, మరికొందరు దీనిని అనుచితంగా విమర్శిస్తున్నారు.
ఇటీవల సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటికి బెయిల్ లభించింది. అలాగే గతేడాది మెడికల్ కాలేజీ అంశంపై జరిగిన ఆందోళనల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులోనూ బెయిల్ వచ్చింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన విడుదల కావడం లాంఛనమేనని భావించిన వేళ, సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పోలీసులు పీటీ వారెంట్‌పై కోర్టును ఆశ్రయించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
దీంతో అంబటికి మరోసారి నిరాశే ఎదురైంది. తాజా రిమాండ్ నేపథ్యంలో ఆయన తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోతో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది.
This post was last modified on February 12, 2026 11:32 pm
గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి తర్వాత.. పార్టీ పుంజుకుంటున్న పరిస్థితి…
రాజమౌళితో సినిమా చేయాలని ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి పేరున్న హీరో ఆశపడుతుంటాడు అనడంలో సందేహం లేదు. ఐతే రాజమౌళి…
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…