Movie News

రామ్ చరణ్ 17… రెండు గుర్రాలపై స్వారీ?

నిన్న జరిగిన శ్రీవిష్ణు మృత్యుంజయ్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు హుసేన్ షా కిరణ్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారాయి. దర్శకుడు సుకుమార్ రైటింగ్ టీమ్ లో ఇప్పటికీ కొనసాగుతున్న ఈయన రామ్ చరణ్ 17 కోసం రెండు కథలు సిద్ధమవుతున్నాయని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

తనవైపు నుంచి ఒక వెర్షన్, సుకుమార్ బృందం మరొకటి రెడీ చేస్తోందని, ఏది ఫైనల్ అవుతుందో త్వరలో వెల్లడి కానుందని చెప్పి స్వీట్ షాక్ ఇచ్చారు. నిజానికి గత కొన్ని నెలలుగా దర్శకుడి టీమ్ ఈ పని మీద పలుమార్లు దుబాయ్ వెళ్ళొచ్చింది. రామ్ చరణ్ కూడా కొన్ని సిట్టింగ్స్ లో ఉన్నాడు.

అసలు స్టోరీ ఎప్పుడో రెడీ అయ్యిందని, డిఫరెంట్ ట్రీట్ మెంట్ తో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, రంగస్థలం పుష్ప ఫ్లేవర్ పక్కనపెట్టి సుకుమార్ కొత్తగా ట్రై చేస్తున్నారనే ప్రచారం ముందు నుంచీ ఉంది. మరి ఇప్పుడు రెండు స్టోరీల మర్మం ఏమిటో అర్థం కాక అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు.

ఇన్ సైడ్ టాక్ ప్రకారం అలాంటి అయోమయం చెందాల్సిన అవసరం ఏమి లేదట. హుసేన్ షా కిరణ్ మాటలు వేరే అర్థంలో వెళ్లాయని, సబ్జెక్టు మీద వర్క్ జరుగుతున్న మాట వాస్తవమే కానీ, అవి ఒకే లైన్ మీద రెండు వెర్షన్లు తప్ప రెండు వేర్వేరు కథలు కాదని అంటున్నారు. నిజమేంటో త్వరలో తేలనుంది.

ప్రస్తుతం పెద్దిని పూర్తి చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న రామ్ చరణ్ వేసవిలో ఆర్సి 17 సెట్స్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది. పుష్ప లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చేస్తున్న మూవీ కావడంతో సుకుమార్ కూడా చాలా జాగ్రత్తగా స్క్రిప్ట్ పనులు చేసుకుంటున్నారు.

అందులోనూ రంగస్థలం కాంబినేషన్, సో అనౌన్స్ మెంట్ నుంచే అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. సంగీత దర్శకుడిగా దేవీశ్రీ ప్రసాద్ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ తర్వాత స్పీడ్ పెంచాలని చూస్తున్న చరణ్ కు పరిస్థితులు అంతగా సహకరించడం లేదు. పెద్ది తర్వాతైనా మార్పు వస్తుందేమో చూడాలి.

This post was last modified on February 12, 2026 11:52 am

Share

Recent Posts

నక్క తోక తొక్కిన కామెడీ నక్సలైట్

మొన్న విడుదలైన కామ్రేడ్ కళ్యాణ్ మెల్లగా మొదలై మంచి వీకెండ్ వసూళ్లను ఖాతాలో వేసుకునే దిశగా పరుగులు పెడుతోంది. టాక్…

1 minute ago

రవితేజ తులాభారం… బాగుంది లెక్కాచారం

ఇరుముడి రూపంలో సూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రవితేజ కొత్త సినిమా తులాభారం ఇవాళ హైదరాబాద్ లో మొదలైపోయింది. ప్రియాంక…

37 minutes ago

మూడోసారి క్లాష్‌లో దేవరకొండ గెలుస్తాడా

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…

58 minutes ago

ఈసారి చలికాలం లేనట్టే

సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…

1 hour ago

కూలీ దర్శకుడికి ఇలాంటి పరిస్థితి ఏంటో

ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…

2 hours ago

ఇకపై జగన్ రోజూ కోర్టుకు వెళ్లాల్సిందేనా

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…

3 hours ago