Movie News

ఇకపై ఉత్త శ్రీలీల కాదు

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అంటూ చాలామంది సినీ జనాలు చెబుతుంటారు. ఐతే యాక్టర్ అయ్యాక డాక్టర్ అయిన వాళ్లు మాత్రం అరుదుగానే ఉంటారు. కన్నడనాట స్థిరపడ్డ తెలుగమ్మాయి శ్రీలీల ఈ కోవకే చెందుతుంది. టీనేజీలోనే సినీ రంగంలోకి అడుగు పెట్టేసిన ఆమె.. కోట్ల పారితోషకం తీసుకునే స్థాయికి ఎదిగినా చదువును మాత్రం విడిచిపెట్టలేదు.

అలా అని మొక్కుబడిగా ఏదో ఒక డిగ్రీ కోసం ట్రై చేయకుండా అత్యంత కష్టమైన ఎంబీబీఎస్‌లో చేరింది. తీరిక లేకుండా సినిమాలు చేస్తూనే చదువును కొనసాగించింది. ఆమె ఎంబీబీఎస్ పూర్తి చేసిన విషయం కొన్ని నెలల కిందటే వెల్లడైంది. ఇప్పుడు శ్రీలీల.. అధికారికంగా డిగ్రీ తీసుకుంది. శ్రీలీల తాను చదివిన కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందిన ఫొటో సోషల్ మీడియాలోకి వచ్చింది.

బహు భాషల్లో కథానాయికగా స్టార్ స్టేటస్ తెచ్చుకుని, వరుసగా సినిమాలు చేస్తూ కూడా ఎంబీబీఎస్ పూర్తి చేయడం ద్వారా శ్రీలీల యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అధికారికంగా పట్టా పుచ్చుకుంది కాబట్టి.. ఇకపై సినిమాల్లో తన పేరును ‘డాక్టర్ శ్రీలీల’ అని వేయాలి. కన్నడ సినిమాలతో కథానాయికగా పరిచయం అయిన శ్రీలీల.. ‘పెళ్ళిచూపులు’ చిత్రంతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఇప్పటికే తెలుగులో ఆమె పది సినిమాలకు పైగా చేసింది.

ఇటీవలే శివ కార్తికేయన్ చిత్రం ‘పరాశక్తి’తో తమిళంలోకి అడుగు పెట్టింది శ్రీలీల. ఆ సినిమా అనుకున్నంతగా ఆడకపోయినా.. ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో మళ్లీ ఓ పెద్ద సక్సెస్ కోసం చూస్తున్న ఆమె.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఆమె హిందీలో అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా ఓ సినిమా చేస్తోంది.

This post was last modified on February 11, 2026 4:42 pm

Share

Recent Posts

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

29 minutes ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

1 hour ago

ఏమీ పట్టనట్టువుంటే ఎలా జగన్?

స్థానిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అధికార కూటమి భావిస్తోంది. వీలైంత వరకు ఎన్నికలు…

2 hours ago

విజయదశమి క్లాష్… ‘పంచతంత్ర’ పోటీ

ఆదర్శ కుటుంబం తప్పుకుంది. అక్టోబర్ 2 విడుదలైన వాటికి పెద్దగా ఆదరణ దక్కలేదు. సో దసరా పండక్కు వచ్చే సెలవులను…

2 hours ago

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

13 hours ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

13 hours ago