పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలున్న దురంధర్-2 పోటీలో ఉన్నా సరే మార్చి 19నే తమ సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయింది టాక్సిక్ టీం. ఇందుకు చిత్ర బృందాన్ని అందరూ అభినందిస్తున్నారు. కానీ దురంధర్-2కు దీటుగా తమ సినిమాకూ హైప్ ఉందని చాటుకునేందుకు టాక్సిక్ టీం వేస్తున్న పీఆర్ ఎత్తుగడలే కొంచెం విడ్డూరంగా అనిపిస్తున్నాయి.
ఈ సినిమా థియేట్రికల్ హక్కుల కోసం మామూలు డిమాండ్ లేదని, ఫ్యాన్సీ రేట్లు ఇచ్చి రైట్స్ తీసుకుంటున్నారనే భావన కల్పించేలా ఉంటున్నాయి ప్రకటనలు. ఇటీవల ఏపీ, తెలంగాణ హక్కులను దిల్ రాజు ఏకంగా రూ.120 కోట్లు పెట్టి తీసుకున్నట్లు లీక్స్ ఇచ్చారు.
కానీ యశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయిన కేజీఎఫ్-2కు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ రూ.84 కోట్లు. ఆ సినిమాకున్న హైప్ ఎలాంటిదో తెలిసిందే. మరి టాక్సిక్‌కు ఎలా రూ.120 కోట్లు ఇచ్చేస్తారన్నది ప్రశ్నార్థకం. అయినా ఆ నంబర్ గురించి ప్రచారం చేసుకున్నారు. ఇది జనాలకు నమ్మశక్యంగా అనిపించలేదు.
కట్ చేస్తే ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ గురించి సోషల్ మీడియాలో కనిపిస్తున్న వార్తలు కూడా మరింత షాకింగ్‌గా అనిపిస్తున్నాయి. ఏకంగా రూ.105 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడైనట్లు కొందరు ఫిలిం క్రిటిక్స్, ట్రేడ్ పండిట్లు పోస్టులు వేస్తున్నారు. ఈ నంబర్ గురించి విపరీతమైన హైప్ ఇస్తున్నారు.
కానీ నిజంగా వంద కోట్లకు పైగా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడయ్యేంత హైప్ టాక్సిక్‌కు ఉందా అన్నది డౌట్. అసలు ఇటీవల టీజర్ రావడానికి ముందు వరకు సినిమాకు పెద్దగా బజ్ లేదు. టీజర్ కొంచెం హైప్ పెంచినా సరే.. దాని చుట్టూ నెగెటివిటీ కూడా లేకపోలేదు. హైప్ అమాంతం పెరిగిపోయిన పరిస్థితి అయితే లేదు.
దురంధర్-2కు తాము ఏమాత్రం తీసిపోవట్లేదని చాటుకోవడానికి టీం కావాలనే ఇలాంటి నంబర్స్ ప్రచారంలోకి తెచ్చి ఓవర్ హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే కోవలో హిందీ హక్కులకు రూ.200 కోట్ల నంబర్ వేసేస్తారేమో అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు కూడా పడుతుండడం గమనార్హం.
This post was last modified on February 11, 2026 8:11 am
కేవలం ఒక్క రోజు గ్యాప్ లో సూపర్ స్టార్ రజనీకాంత్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ వద్ద తలపడటం…
సహజంగా మూడు ఋతువులు వుంటాయి. నాలుగు నెలలు శీతాకాలం, నాలుగు నెలలు వేసవి కాలం, మరో నాలుగు నెలలు వర్షా…
ఒక్క ఫ్లాప్ కొందరు స్టార్ డైరెక్టర్ల ప్లానింగ్ ని ఎంత ప్రభావితం చేస్తుందో చెప్పడానికి లోకేష్ కనగరాజ్ ఉదాహరణ చాలు.…
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత అక్రమాస్తుల కేసులో ఈడీ స్పీడ్ పెంచడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఉన్నట్టుండి…
మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…