Movie News

నైజాం కొత్త దుకాణం… నిర్మాత ఏమ‌న్నాడంటే?

తెలుగు రాష్ట్రాల్లో సినిమాల‌కు బిజినెస్ ప‌రంగా అత్యంత కీల‌క‌మైన నైజాం ఏరియాలో కొత్త డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌లు తెర‌పైకి రావ‌డం ఇటీవ‌ల చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లూ ప్రొడ‌క్ష‌న్‌కే ప‌రిమితం అవుతూ, ఎప్పుడో ఒక‌సారి వేరే సినిమాల‌ను రిలీజ్ చేస్తూ వ‌చ్చిన‌ అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ.. పూర్తి స్థాయిలో పంపిణీ రంగంలోకి దిగిన సంగ‌తి తెలిసిందే.

ఒకేసారి ఆ సంస్థ దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల‌ను నైజాంలో రిలీజ్ చేసే దిశ‌గా ఒప్పందం చేసుకున్న‌ట్లు వెల్ల‌డైంది. ఇంకో రెండు మూడు సంస్థ‌లు నైజాం డిస్ట్రిబ్యూష‌న్లోకి వ‌స్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో ధీర‌జ్ మొగిలినేని సంస్థ కూడా ఒక‌టి. అత‌ను కపుల్ ఫ్రెండ్లీ సినిమాను నైజాంలో పంపిణీ చేస్తున్నాడు.

ఇందుకోసం ఆఫీస్ కూడా మొద‌లుపెట్టాడు. దిల్ రాజు అండ్ కోకు చెక్ పెట్ట‌డానికి, ఏక‌ఛ‌త్రాధిప‌త్యాన్ని అరిక‌ట్ట‌డానికి, అలాగే డిస్ట్రిబ్యూషన్లో త‌లెత్తుతున్న ఇబ్బందులు, మోసాల‌ను అధిగమించ‌డానికే ఇండ‌స్ట్రీలో ప‌లువురు నిర్మాత‌లు మాట్లాడుకుని సొంతంగా డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీసులు తెరుస్తున్న‌ట్లు చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో ధీర‌జ్ మొగిలినేని క‌పుల్ ఫ్రెండ్లీ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో స్పందించాడు. తాను సుహృద్భావ వాతావ‌ర‌ణంలోనే సొంత డిస్ట్రిబ్యూట్ ఆఫీస్ మొద‌లుపెట్టినట్లు చెప్పాడు. త‌న‌కు దిల్ రాజు, శిరీష్ 20 ఏళ్లుగా తెలుసని, వారితో మంచి అనుబంధం ఉంద‌ని.. ఇలా డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ తెరుస్తున్నాన‌ని చెబితే, మంచిదే చేయ‌మ‌ని వారు త‌నను ప్రోత్స‌హించార‌ని చెప్పాడు ధీర‌జ్.

ఇక తాను ప్రొడ్యూస్ చేసిన‌ సినిమాల‌న్నింటినీ అల్లు అర‌వింద్ భాగస్వామ్యంతోనే చేశాన‌ని, ఆయ‌నా త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్నార‌ని చెప్పాడు. సురేష్ బాబు సైతం తన‌కు అండ‌గానే నిలిచార‌న్నాడు.

నైజాం డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు బాగా డ‌బ్బులొచ్చే ఏరియా అని, ఇక్క‌డ డిస్ట్రిబ్యూట్ చేస్తే నాలుగు డ‌బ్బులు తినొచ్చ‌నే ఉద్దేశంతోనే ఇందులోకి దిగాన‌ని.. అంతే త‌ప్ప ఎవ‌రికీ పోటీ కాద‌ని, ఎవ‌రితోనూ త‌న‌కు గొడ‌వ‌లు లేవ‌ని స్ప‌ష్టం చేశాడు ధీర‌జ్. క‌పుల్ ఫ్రెండ్లీ సినిమా మీద న‌మ్మ‌కంతో నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాన‌ని.. ఈ సినిమా త‌న‌కు మంచి ఫ‌లితాన్నిస్తుంద‌ని అత‌ను ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

This post was last modified on February 11, 2026 8:39 am

Share

Recent Posts

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

17 minutes ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

3 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

5 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

5 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

6 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

14 hours ago