Movie News

సల్మాన్ ఖాన్ ప్లాన్ బెడిసికొట్టిందా?

దేశ సరిహద్దుల్లో జరిగే పరిణామాల మీద, ఇండియన్ ఆర్మీ నేపథ్యంలో దేశభక్తి సినిమాలు తీయడంలో బాలీవుడ్ దర్శకులను మించిన వాళ్లు లేరు. కొన్నేళ్ల ముందు ‘యురి’ చిత్రంతో ఆదిత్య ధర్ ఎలా బాక్సాఫీస్‌ను షేక్ చేశాడో తెలిసిందే. అదే దర్శకుడు ‘దురంధర్’తో ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేశాడు. బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్ నుంచి ఇలాంటి సినిమాలు దాదాపుగా రాలేదనే చెప్పాలి.

పాకిస్థాన్‌, గల్ఫ్ కంట్రీస్‌లో సల్మాన్‌కు భారీ మార్కెట్ ఉన్న దృష్ట్యా అతను పాకిస్థాన్‌ను పూర్తి స్థాయి శత్రువుగా చూపించే సినిమాలు చేయడు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అలా అని ట్రెండును ఫాలో అవ్వకపోతే కష్టం. తనకు సక్సెస్ చాలా అవసరం. అందుకే చైనాను విలన్‌గా చూపించే సినిమాను టేకప్ చేశాడు. అదే.. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్.

2020లో భారత్, చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య భీకర పోరు జరిగింది. అందులో భారత్‌దే పైచేయి అయింది. దీని నేపథ్యంలో అపూర్వ లఖియా దర్శకత్వంలో ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్’ సినిమాను మొదలుపెట్టాడు సల్మాన్. ఐతే కొన్ని నెలల ముందు రిలీజైన టీజర్ తుస్సుమనిపించింది. ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి రేకెత్తించలేదు. టీజర్ చూస్తే అతిశయోక్తులతో సినిమాను నింపేసినట్లు అనిపించింది. ఈ నేపథ్యంలో నెగెటివిటీ తప్పలేదు. 

ఇండియాకు బద్ధ శత్రువైన పాకిస్థాన్ మీద సినిమాలు తీయడు, పహల్గాం ఉగ్రదాడిని ఖండించడు కానీ.. సక్సెస్ కోసం చైనా మీద సినిమా చేశాడంటూ సల్మాన్ మీద కౌంటర్లు కూడా పడ్డాయి. మొత్తంగా సినిమా మీద నెగెటివిటీ ముసురుకుంది. దీంతో సల్మాన్ అండ్ టీం పునరాలోచనలో పడింది.

ఏప్రిల్లో అనుకున్న రిలీజ్ డేట్ ను మారుస్తున్నారట. జూన్ లేదా జులైకి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారట. సినిమాకు రీషూట్లు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపుల నుంచి సల్మాన్‌కు ఉపశమనాన్ని ఇస్తుందనుకున్న సినిమా కాస్తా.. అతడికి మరో గుదిబండగా మారుతుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

This post was last modified on February 9, 2026 3:13 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

1 hour ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago