టాలీవుడ్ పెద్ద సినిమాలకే బాలీవుడ్ మార్కెట్‌లో సరైన రిలీజ్ దొరకడం ఈ మధ్య కాలంలో ఒక పెద్ద టాస్క్‌గా మారింది. చాలా వరకు మన టైర్ 2 హీరోలు అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకున్నా, ఆశించిన స్థాయిలో థియేటర్లు లేదా ప్రమోషన్లు దొరకక వెనకబడిపోతున్నారు. కానీ నాని తన రాబోయే సినిమా ‘ది ప్యారడైజ్’ విషయంలో మాత్రం పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. అతి పెద్ద రేంజ్‌లో ఈ సినిమాను హిందీ బెల్ట్‌లో దించాలని మేకర్స్ స్కెచ్ వేశారు.
సాధారణంగా సౌత్ సినిమాలు హిందీలో రిలీజ్ అవ్వాలంటే అందరూ గోల్డ్ మైన్స్, పెన్ స్టూడియోస్, ఏ ఏ లాంటి సంస్థల వైపు చూస్తుంటారు. కానీ నాని టీమ్ మాత్రం ఈసారి రూట్ మార్చి జియో స్టూడియోస్‌ను లైన్లోకి తెచ్చినట్లు ఇండస్ట్రీ టాక్. ఇటీవలే రణ్వీర్ సింగ్ ‘ధూరందర్’ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేసి, 1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ట్రాక్ రికార్డ్ జియో స్టూడియోస్‌కు ఉంది. అలాంటి బడా సంస్థ నాని సినిమాను టేకోవర్ చేయడం హిందీ మార్కెట్‌లో ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది.
ఈ వారంలోనే హిందీ రిలీజ్ డీల్‌కు సంబంధించి క్లోజింగ్ పనులు పూర్తి కాబోతున్నట్లు సమాచారం. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. గతంలో ‘దసరా’తో బిగ్ హిట్ కొట్టిన నాని, ఈసారి మాత్రం కేవలం సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా గట్టి ఇంపాక్ట్ చూపించాలని చూస్తున్నారు. జియో స్టూడియోస్ గనుక రంగంలోకి దిగితే థియేటర్ల కౌంట్ ప్రమోషన్ల విషయంలో సినిమాకు ఒక రేంజ్ హైప్ దొరుకుతుంది.
నిజానికి బాలీవుడ్ ఆడియన్స్ ఇప్పుడు వైవిధ్యమైన సౌత్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సరైన సమయంలో, బలమైన సంస్థ ద్వారా సినిమాను ప్రమోట్ చేస్తే నాని రేంజ్ అక్కడ కూడా పెరగడం ఖాయం.
‘ది ప్యారడైజ్’ సక్సెస్ అయితే, టాలీవుడ్ మిగతా హీరోలకు కూడా ఇది ఒక కొత్త దారి చూపిస్తుంది. జియో స్టూడియోస్ పట్టుకున్న డీల్ పై త్వరలోనే అఫీషియల్‌గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే మేకర్స్ ఇంత పెద్ద స్టెప్ వేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ భారీ రిలీజ్ ప్లాన్ నానికి బాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
This post was last modified on February 9, 2026 3:05 pm
ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…
తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే హవా చూపించాయి.…
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…