Movie News

వివాదాలతో వసూళ్లు ఎలా వస్తాయి

ఈ మధ్య కంటెంట్ కన్నా ఎక్కువగా కాంట్రావర్సితో వార్తల్లో నిలిచిన సినిమా బరాబర్ ప్రేమిస్తా. ప్రముఖ టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ రెండో మూవీ ఇది. ముందు నుంచి యాటిట్యూడ్ పేరుతో వివాదాలకు కేంద్రంగా నిలుస్తున్న ఈ కుర్రాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడిన బూతు పాట ఏకంగా పోలీసు కేసుల దాకా వెళ్లిన సంగతి తెలిసిందే.

ఒక టీవీ జర్నలిస్టుతో రేగిన ఆన్ లైన్ గొడవ చాలా దూరమే లాగింది. అయితే ఇదంతా ఓపెనింగ్స్ కు ఉపయోగపడొచ్చేమోనని టీమ్ భావించినా లేదా చంద్రహాసే అనుకున్నా పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే బరాబర్ ప్రేమిస్తాకు పెద్దగా స్పందన లేదు. జనం ఆసక్తి చూపించని వైనం కనిపించింది.

తన మాటల వల్ల డ్యామేజ్ అయిందేమోనని ఇప్పుడు కన్నీళ్లు పెడుతున్న చంద్రహాస్ అదేదో ముందే గుర్తించి ఉంటే బాగుండేది. బూతులు వాడటమే కాక దాన్ని లైవ్ ఛానల్స్ లో సమర్ధించుకున్న విధానం, వితండవాదం చేసుకున్న వైనం సాధారణ ప్రేక్షకులతో అతన్ని డిస్ కనెక్ట్ అయ్యేలా చేసింది.

ఎంత అతి చేస్తే అంత ఫోకస్ లో ఉంటామని ఎవరైనా చెప్పారో ఏమో కానీ పరిణితి లేని ప్రవర్తన వల్ల ఇక్కడి దాకా తెచ్చుకున్నాడు. వేల కోట్ల సామ్రాజ్యాలు ఉన్న స్టార్ కిడ్స్ సైతం ఎప్పుడూ హద్దులు దాటిన దాఖలాలు లేవు. అలాంటిది అప్ కమింగ్ స్టేజిలో ఉన్న కుర్రాడు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సింది.

అసలే ఫిబ్రవరి డ్రైగా మొదలయ్యింది. ఎనిమిది సినిమాలు రిలీజైతే ఒక్కటి కూడా హౌస్ ఫుల్స్ పడలేని దారుణమైన పరిస్థితి నెలకొంది. పాత డిజాస్టర్ ఆరంజ్ హౌస్ ఫుల్ అవుతుంటే యుఫొరియా, శ్రీ చిదంబరంగారు లాంటి నోటెడ్ మూవీస్ కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇక బరాబార్ ప్రేమిస్తా గురించి చెప్పడానికి ఏముంది.

ఏమైనా తన మీద గుడ్డిగా కోట్లు పెడుతున్న నిర్మాతలను దృష్టిలో ఉంచుకుని చంద్రహాస్ తనను తాను మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేనిలాగే ఉంటాను నాలాగే ఉంటాను అంటే ఆడియన్స్ కూడా మేము కూడా ఇలాగే ఉంటాం తిరస్కరిస్తూనే ఉంటాము అంటారు.

This post was last modified on February 7, 2026 6:25 pm

Share

Recent Posts

రావిపూడికి రిపేర్ చేయాల్సిన అవసరముందా

ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…

22 minutes ago

ఆ వైద్య కళాశాలలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగుల‌కు సేవ‌లు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్…

3 hours ago

టీడీపీ జెండాను తొక్కిన వైసీపీ కార్యకర్తలు.. కరెక్టుగా డీల్ చేసిన గుడివాడ ఎమ్మెల్యే

గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.  ఎన్నికల ప్రచారంలో  జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…

3 hours ago

కోర్టుకెక్కుతున్న ‘హనుమాన్’ పంచాయితీ?

2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…

3 hours ago

క‌లెక్ట‌ర్‌ తోనే పెట్టుకున్న ఎమ్మెల్యే… తమిళనాట రచ్చ రచ్చ!

``నువ్వు కొంచెం గ్లామ‌ర్‌గా ఉండాలి. పంజాబీ డ్ర‌స్.. నీకు బాగుంటుంది. చీర‌ల సెల‌క్ష‌న్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…

3 hours ago

అవెంజర్స్ అంటే ఇంత పిచ్చి ఉందా

వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది.…

3 hours ago