అందం, అభినయం రెండూ ఉన్న కథానాయిక రాశి ఖన్నా. తొలి సినిమాలోనే ఆమె ఈ రెండు విషయాల్లోనూ స్కోర్ చేసింది. కానీ చేసింది చిన్న సినిమా కావడంతో ఒకేసారి పెద్ద సినిమాల్లో అవకాశం రాలేదు. ఇప్పటికీ టైర్-2 హీరోయిన్‌గానే కొనసాగుతోంది.
మధ్యలో ‘జై లవకుశ’ లాంటి ఓ పెద్ద సినిమాలో నటించింది కానీ దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. అందులో ఆమె ప్రత్యేకంగా చేయడానికి ఏమీ లేకపోయింది.
ఆపై ‘తొలి ప్రేమ’ సినిమాతో తన టాలెంటంతా బయటపెట్టినా కూడా రాశి కోరుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ఈలోపు తమిళంలోకి వెళ్లి చెప్పుకోదగ్గ సినిమాలే చేసింది రాశి. ఇప్పుడు ఆమెకు కెరీర్లో అతి పెద్ద అవకాశం వచ్చినట్లే కనిపిస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య సరసన రాశి నటించబోతోంది. హరి దర్శకత్వంలో సూర్య చేయబోయే కొత్త సినిమాలో రాశినే కథానాయిక. తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు తాజాగా అభిమానులతో చేసిన ట్విట్టర్ చిట్ చాట్‌లో ఆమె వెల్లడించింది.
దీంతో పాటు సుందర్ దర్శకత్వంలో ‘ఆరణ్మయి-3’ కూడా చేస్తున్నట్లు ఆమె చెప్పింది. ఐతే తెలుగులో మాత్రం రాశి ఏ కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ఖరారు చేయలేదు. చర్చలు జరుగుతున్నాయని.. లౌక్ డౌన్ తర్వాత టాలీవుడ్ కొత్త సినిమాల గురించి వెల్లడిస్తానని చెప్పింది.
ఇక ఈ చిట్‌చాట్‌లో మీ ఆల్ టైం ఫేవరెట్ మూవీ ఏంటి అని అడిగితే.. ‘ది ప్రపోజల్’ అని చెప్పిన రాశి.. తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం ఏంటి అంటే.. ‘నా ప్రాణం’ అని బదులిచ్చింది.
తమిళంలో తన ఫేవరెట్ హీరో విజయ్ అని చెప్పిన రాశి.. అక్కడి దర్శకుల్లో వెట్రిమారన్, శంకర్, మణిరత్నంలను ఎక్కువగా అభిమానిస్తానని అంది. అల్లు అర్జున్ గురించి చెప్పమని ఓ అభిమాని అడిగితే.. తన చుట్టూ ఉన్న వాళ్లను ఎంతగానో ప్రోత్సహిస్తాడని.. ఆయనతో నటించాలని ఉందని చెప్పింది రాశి.
This post was last modified on May 3, 2020 10:46 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…