షాకింగ్… ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బాలీవుడ్ దర్శకుడి పేరు?

ఎప్‌స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్‌స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది ప్రముఖులను పిలిచి చిన్న వయసు అమ్మాయిలతో శృంగారం చేయించేవాడని వెల్లడి కావడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించి ఫొటోలు, వీడియోలు ఎన్నో బయటికి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ కుంభకోణంలో అమెరికన్లే కాక వివిధ దేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు భాగమైనట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్.. 2017లో ఎప్‌స్టీన్ పార్టీ కోసం బీజింగ్ వెళ్లారంటూ ఒక రూమర్ ముంబయి వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో అనురాగ్ వెంటనే స్పందించాడు.

ఒక మీడియా సంస్థతో అనురాగ్ మాట్లాడుతూ.. ‘‘ఒక స్పీకర్‌గా నాకు నెలకు దాదాపు 15 ఆహ్వానాలు అందుతుంటాయి. నేను అన్నింటికీ స్పందించను. అరుదుగా మాత్రమే రెస్పాండ్ అవుతుంటా. నా జీవితంలో ఇప్పటివరకు బీజింగ్‌కే వెళ్లలేదు’’ అని అనురాగ్ స్పష్టం చేశాడు.

తన సినిమాల కంటే తన పేరుతో కూడిన రూమర్లపై అందరూ ఆసక్తి చూపించడాన్ని అనురాగ్ తప్పుబట్టాడు. బాలీవుడ్‌కు చెందిన మరి కొంతమంది దర్శక నిర్మాతలు, నటీనటులు ఈ పార్టీల్లో పాల్గొన్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇందులో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షకుడు బిల్ క్లింటన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, లెజెండరీ బిజినెస్‌మ్యాన్ బిల్ గేట్స్ లాంటి వాళ్ల పేర్లు కూడా బయటికి రావడం సంచలనం రేపుతోంది. వీరు తప్పు చేశారని ఒక నిర్ధారణకు రాలేం కానీ.. వీరిలో కొందరు పార్టీల్లో పాల్గొన్నట్లుగా కొన్ని ఫొటోలు అయితే ఇంటర్నెట్లో తిరుగుతున్నాయి.