పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న సంగతి తెలిసిందే. ఆమె నటిగా సత్తా చాటుకుంది. రచయితగా, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా సినిమాలు చేసింది. పవన్ నుంచి విడిపోయాక సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఆమె ప్రయత్నం చేస్తూనే ఉంది. కొంచెం గ్యాప్ తర్వాత ఆమె ఒక మెయిన్ స్ట్రీమ్ మూవీలో నటిగా తళుక్కుమనడం విశేషం. ఆ చిత్రమే.. ఓం.
ధనుష్ హీరోగా ‘అమరన్’ దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి రూపొందించిన ‘ఓం’పై భారీ అంచనాలే ఉన్నాయి. మమ్ముట్టి ఓ కీలక పాత్ర చేసిన ఈ చిత్రం ఈ నెల 20న తమిళ, తెలుగు భాషల్లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో ధనుష్‌కు జోడీగా శ్రీలీల నటించగా.. సాయిపల్లవి పోలీసాఫీసర్‌గా ప్రత్యేక పాత్ర చేస్తోంది. ఇందులో ఇంకో ముఖ్యమైన లేడీ క్యారెక్టర్లో రేణు నటిస్తున్న విషయం ట్రైలర్లో వెల్లడైంది.
రేణు మీద జస్ట్ ఒక షాట్ మాత్రమే పెట్టారు. క్యారెక్టర్ గురించి ఎలాంటి డీటైలింగ్ లేదు. ఆయన గురించి ఆలోచించి బుర్ర బద్దలవుతోంది అనే డైలాగ్ ఆమె మీద పెట్టారు. ఆమెది మమ్ముట్టి భార్య పాత్ర అయి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో మమ్ముట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ రాకెట్‌ను నడిపే డాన్ పాత్రలో కనిపించనున్నాడు. మమ్ముట్టి, రేణు కలిసి కనిపించకపోయినా.. ఆమె ఆయన భార్య పాత్ర చేసి ఉండొచ్చనే సంకేతాలు కనిపించాయి.
నటిగా బిజీ అవ్వాలని చూస్తున్న రేణుకు ‘ఓం’ మంచి అవకాశంలాగే కనిపిస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న సినిమాలో కీలక పాత్రలో రాణించిందంటే రేణుకు మున్ముందు మంచి అవకాశాలు రావచ్చు. ‘ఓం’ ఏపీ, తమిళనాడు సరిహద్దుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చుట్టూ నడిచే కథ. 2015లో 21 మంది తమిళ కూలీలను ఏపీ పోలీసులు చంపిన ఉదంతం చుట్టూ ఈ కథ సాగుతుందని.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ విషయంలో వివాదాలు రేకెత్తడం ఖాయమని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
