ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకడు. యశ్ లాంటి మీడియం రేంజ్ హీరోను పెట్టి ‘కేజీఎఫ్’ను మాస్‌కు పూనకాలు తెప్పించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. అతనిచ్చిన హీరో ఎలివేషన్లకు వివిధ భాషల ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. యశ్ అనే వాడు తమకు పరిచయం లేకపోయినా సరే.. ‘కేజీఎఫ్’లో ఒక సూపర్ స్టార్‌ను చూస్తున్న ఫీలింగ్ కలిగిందంటే అదంతా ప్రశాంత్ ప్రతిభే.
ఈ సినిమా తర్వాత ప్రశాంత్‌తో పని చేయడానికి వివిధ ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్లు ఆసక్తి చూపించారు. ఓవైపు ‘కేజీఎఫ్-2’ చేస్తూనే.. అతను టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రభాస్‌తో ఓ సినిమాను ఓకే చేశాడు. ‘సలార్’ పేరుతో తెరకెక్కనున్న ఆ సినిమాను ఇటీవలే ప్రకటించారు కూడా. అలాగే జూనియర్ ఎన్టీఆర్‌తోనూ సినిమా చేయడానికి ప్రశాంత్ కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్నదానిపై స్పష్టత లేదు.
ఈలోపు ప్రశాంత్ మరో సినిమాను ఓకే చేశాడు. కాకపోతే ఆ సినిమాకు ప్రశాంత్ స్క్రిప్టు మాత్రమే అందిస్తున్నాడు. దర్శకత్వ బాధ్యతలు మరో వ్యక్తికి అప్పగించాడు. ‘కేజీఎఫ్’తో పాటు ‘సలార్’ను నిర్మిస్తున్న హోంబలె ఫిలిమ్స్‌తోనే ఈ సినిమా కూడా చేయబోతున్నాడు ప్రశాంత్. ఈ చిత్రానికి ‘భగీర’ అనే మాస్ టైటిల్ ఖరారు చేశారు.
ఇందులో శ్రీ మురళి కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ యువ నటుడితోనే ప్రశాంత్ దర్శకుడిగా తన తొలి చిత్రం చేశాడు. ‘ఉగ్రం’ పేరుతో తెరకెక్కిన ఆ గ్యాంగ్‌స్టర్ డ్రామా సూపర్ హిట్టయింది. తర్వాత ‘కేజీఎఫ్’తో ప్రశాంత్ రేంజే మారిపోయింది. ఇప్పుడు శ్రీ మురళి హీరోగా హోంబలె ఫిలిమ్స్‌లో వరుసగా తన నాలుగో చిత్రాన్ని అనౌన్స్ చేశాడు ప్రశాంత్.ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో హీరో పోలీస్. పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ డిజైన్ చేసి When socitey becomes jungle.. and only one predator roars for justice అంటూ క్యాప్షన్ జోడించడంతో ఇందులోనూ ప్రశాంత్ మార్కు హీరో ఎలివేషన్లు, మాస్ సన్నివేశాలకు లోటుండదని భావిస్తున్నారు.
This post was last modified on December 17, 2020 2:26 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…