బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం అలవాటుగా మారింది. మొదటి సినిమా ప్రెస్ మీట్ లో అతని బిల్డప్ చూసి యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చారు నెటిజన్లు. ఐతే ఎలాగోలా ఆడియన్స్ లో ఉండటమే అదే చర్చల్లో ఉండటమే బెటర్ అనుకున్న చంద్రహాస్ తన మీద వస్తున్న కామెంట్స్, వైరల్ కంటెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ముందు సరదాగా మొదలు పెట్టినా కూడా అతని యాటిట్యూడ్ థింగ్స్ అతనికి మంచి చేస్తున్నాయి.
ప్రస్తుతం అతను బరాబర్ ప్రేమిస్తా సినిమాతో రాబోతున్నాడు. సాధ్యమైనంత విధంగా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రహాస్. రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక సాంగ్ పాడి అందులో బూతులను వాడి వైరల్ అయ్యాడు చంద్రహాస్. ఆ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో తనకు శ్రీలీలని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పి షాక్ ఇచ్చాడు.
అరియానా యాంకరింగ్ లో చంద్రహాస్ ని ముగ్గురు హీరోయిన్స్ ని ఎవరిని ఎంచుకుంటావ్ అని అడిగితే.. అనుపమ, మృణాల్, శ్రీలీల పేర్లు చెప్పాడు. ఈ క్రమంలో అనుపమని రిజెక్ట్ చేసి మృణాల్ తో డేట్ కి వెళ్తా అన్నాడు. ఇక శ్రీలీలని పెళ్లి చేసుకుంటా అన్నాడు చంద్రహాస్. శ్రీలీల తను ఒకే ఏజ్ గ్రూప్ కాబట్టి బ్యాలెన్సింగ్, ఇచ్చి పుచ్చుకోవడం బాగుంటుంది అందుకే శ్రీలీలను పెళ్లి చేసుకుంటా అన్నాడు చంద్రహాస్.
తను తీసే సినిమాల కన్నా చంద్రహాస్ ఇచ్చే ఇంటర్వ్యూస్, చేసే కామెంట్స్ వల్లే అతను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఏదో ఒక విధంగా టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు చంద్రహాస్ చేస్తున్న ప్రయత్నం మెచ్చుకోదగినదే అని చెప్పొచ్చు. బరాబర్ ప్రేమిస్తా సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాలో చంద్రహాస్ సరసన మేఘన ముఖర్జీ జత కట్టింది.
బరాబర్ ప్రేమిస్తా ప్రమోషన్స్ లో చంద్రహాస్ యాక్టివిటీస్ మళ్లీ అతన్ని సోషల్ మీడియాలో ఉండేలా చేస్తున్నాయి. చంద్రహాస్ సినిమాల కమిట్మెంట్ ఎలా ఉన్నా ప్రతి మూవీకి అతను ఆఫ్ స్క్రీన్ చేసే హడావిడి మాత్రం జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates