Movie News

‘దంగల్’ రికార్డుకు మూడినట్లేనా?

పదేళ్ల ముందు రిలీజైన సినిమా.. దంగల్. కానీ ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీ రికార్డు ఆ సినిమా పేరు మీదే ఉంది. నిజానికి మొదట రిలీజైనపుడు ఆ సినిమాకు వచ్చిన వసూళ్లు రూ.800 కోట్లే. 2017లో వచ్చిన ‘బాహుబలి: ది కంక్లూజన్’ రూ.1800 కోట్ల వసూళ్లతో ‘దంగల్’ను దాటేసింది.

అయితే ‘బాహుబలి-2’ రిలీజ్ తర్వాత చైనాలో రిలీజైన ‘దంగల్’ అక్కడ అనూహ్యంగా భారీ వసూళ్లు రాబట్టడంతో ఓవరాల్ వసూళ్ల లెక్క మారిపోయింది. ఓవరాల్‌గా ఆ చిత్రం రూ.2000 కోట్లతో రికార్డును సొంతం చేసుకుంది.
తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2, కల్కి లాంటి భారీ చిత్రాలు వచ్చినా ఆ రికార్డును దాటలేకపోయాయి. ఐతే ఈ ఏడాది ‘దంగల్’ రికార్డు బద్దలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.

కొత్త రికార్డును ‘దురంధర్-2’ తన ఖాతాలో వేసుకుంటే ఆశ్చర్యం లేదు. డిసెంబరులో విడుదలైనపుడు ‘దురంధర్’పై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ సినిమా ఎవ్వరూ ఊహించని విధంగా రూ.1300 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఎంత పెద్ద సినిమా అయినా మూణ్నాలుగు వారాలకు మించి ఆడని రోజుల్లో ఆ చిత్రం రెండు నెలల పాటు నిలకడగా వసూళ్లు రాబట్టింది.

ఇంకా ఓ మోస్తరుగా కలెక్షన్లు రాబడుతున్న సమయంలోనే ‘దురంధర్’ ఓటీటీలో రిలీజైంది. ఇక్కడ రెస్పాన్స్ ఇంకో స్థాయిలో ఉంది. ప్రాంతీయ భాషల వాళ్లూ ఈ సినిమాను గొప్పగా ఆదరిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సినిమాకు హైప్ ఇంకా పెరిగింది. డిజిటల్ వెర్షన్ రిలీజైనప్పటి నుంచి సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రెండ్ అవుతున్న తీరు చూస్తే.. ‘దురంధర్-2’ బాక్సాఫీస్ దగ్గర ప్రకంపనలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమా ఓపెనింగ్స్‌కు ఆకాశమే హద్దు. పెద్దగా హైప్ లేకుండానే ‘దురంధర్’ ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టింది.
మరి భారీ అంచనాలతో మార్చి 19న రాబోతున్న ‘దురంధర్-2’కు కలెక్షన్లు ఎలా ఉంటాయో చెప్పేదేముంది? మరీ బ్యాడ్‌గా లేదు అనే టాక్ వచ్చినా ఈ సినిమా వసూళ్ల ఊచకోతతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం.

తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోనూ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఓపెనింగ్స్, ఓవరాల్ వసూళ్లు వేరే స్థాయిలో ఉండడం ఖాయం. అన్నీ కలిసొస్తే ‘దంగల్’ రికార్డును బద్దలు కొట్టి హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా నిలవడం ఖాయం.

This post was last modified on February 3, 2026 11:40 am

Share

Recent Posts

నాని తీయాలనుకున్న ‘24’ సినిమా

నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తెలుగులో టైర్-2లో టాప్ హీరో. ‘ది ప్యారడైజ్’ సినిమా అంచనాలను అందుకుంటే.. అతను టైర్1…

2 hours ago

ప్యారడైజ్ డే-1 ఎంత?

నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో రూపొంది, అత్యధిక అంచనాలతో విడుదల కాబోతోంది ‘ది ప్యారడైజ్’ సినిమా. ఈ…

3 hours ago

తెలంగాణ పోలీసుల ‘ఇరుముడి’ పాట చూశారా?

సినిమా అనేది అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. మంచైనా, చెడైనా జనాల్లోకి చాలా వేగంగా తీసుకువెళ్లే మీడియం ఇది. దీన్ని మంచి…

6 hours ago

నిమ్స్ డాక్టర్ ఆస్తులు 80 కోట్లా?

ఒక డాక్టర్ ఇంటి మీద ఏసీబీ దాడులు చేయడమే ఒక సెన్సేషన్ అయితే ఆయన ఇంట్లో కోట్ల రూపాయల కట్టలు…

9 hours ago

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

11 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

12 hours ago