Movie News

బ‌న్నీ అప్పుడు వైజాగ్ రోడ్లపై న‌డుస్తుంటే…

అల్లు అర్జున్‌కు ఆల్రెడీ హైద‌రాబాద్‌లో రెండు మ‌ల్టీప్లెక్సులు ఉన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టేమో ఏషియ‌న్ వాళ్ల భాగ‌స్వామ్యంతో అమీర్ పేట‌లో స‌త్యం థియేట‌ర్ ఉన్న స్థానంలో నిర్మించిన ఏఏఏ కాగా.. ఇంకోటి కోకాపేట‌లో అల్లు కుటుంబ‌మే సొంతంగా క‌న్‌స్ట్ర‌క్ట్ చేసిన అల్లు సినిమాస్. ఇప్పుడు అల్లు అర్జున్, ఏషియ‌న్ మూవీస్ భాగ‌స్వామ్యంలో కొత్త‌గా ఇంకో మ‌ల్టీప్లెక్స్ మొద‌లైంది.

దీనికి వేదికైంది విశాఖ‌ప‌ట్నం కావ‌డం విశేషం. ఏపీలో అతిపెద్ద న‌గ‌ర‌మైన వైజాగ్‌లో ఒక భారీ మాల్‌లో భాగంగా ఈ ల‌గ్జ‌రీ మ‌ల్టీప్లెక్స్ ఏర్పాటు కావ‌డం ప‌ట్ల బ‌న్నీ చాలా ఎగ్జైట్ అయ్యాడు. ముంబ‌యిలో రాకా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న బ‌న్నీ.. మ‌ల్టీప్లెక్స్ ఓపెనింగ్ కోస‌మే లీవ్ తీసుకుని వ‌చ్చిన‌ట్లు ఈ సంద‌ర్భంగా తెలిపాడు.

వైజాగ్ త‌న‌కెంతో ఇష్ట‌మైన న‌గ‌ర‌మ‌ని, ఇలాంటి చోట త‌న పేరుతో మ‌ల్టీప్లెక్స్ రావ‌డం న‌మ్మ‌శ‌క్యంగా లేద‌ని బ‌న్నీ వ్యాఖ్యానించాడు. త‌న తొలి సినిమా గంగోత్రి షూటింగ్ ఈ సిటీలోనే చేశామ‌ని.. అప్పుడు రోడ్డు మీద తాను న‌డిచి వెళ్తుంటే జ‌నాలు త‌న‌ను గుర్తు పట్టి కూడా ప‌ట్టించుకోకుండా వెళ్లిపోయేవార‌ని.. కానీ ఇప్పుడు ఇదే సిటీలో బ‌య‌ట ఎక్క‌డా న‌డ‌వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చిందని బ‌న్నీ అన్నాడు.

త‌న సినిమాలు మ‌రెన్నో వైజాగ్‌లో షూటింగ్ జ‌రుపుకున్నాయ‌ని.. ఇక్క‌డ త‌న‌కు ఎన్నో మ‌ధుర జ్ఞాప‌కాలున్నాయ‌ని.. ఇలాంటి సిటీలో ఇంత పెద్ద మాల్, అందులో త‌న మ‌ల్టీప్లెక్స్ రావ‌డం అంటే క‌ల నిజం కావ‌డం కంటే పెద్ద విష‌య‌మ‌ని బ‌న్నీ పేర్కొన్నాడు. కొత్త‌గా నిర్మిత‌మైన భోగాపురం ఎయిర్‌పోర్టు గురించి బ‌న్నీ మాట్లాడుతూ.. వ‌ర‌ల్డ్ క్లాస్ లెవెల్లో దీన్ని నిర్మించార‌ని, ఈ ఎయిర్ పోర్టు వ‌ల్ల‌ దుబాయ్ త‌ర‌హాలో వైజాగ్ అభివృద్ధి చెందాల‌ని ఆకాంక్షించాడు.

This post was last modified on August 10, 2026 7:13 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago