తెలుగు టీవీ చరిత్రలోనే ట్రెండ్ సెట్టింగ్ షోల్లో ఆట ఒకటి. అప్పటికే వేరే ఛానెళ్లలో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నప్పటికీ. జీ తెలుగులో వచ్చిన ఈ డ్యాన్స్ షో సంచలనం రేపింది. చాలా ఏళ్ల పాటు అలరించిన ఈ షోకు మధ్యలో బ్రేక్ పడింది. ఓవైపు ఈటీవీలో ఢీ షో నిరాటంకంగా సాగిపోతుండగా.. ఆట మాత్రం ఆగిపోవడం దాని అభిమానులకు నిరాశ కలిగించింది.
ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత ఆట షోను మళ్లీ జీ తెలుగులో పునఃప్రారంభిస్తుండడం విశేషం. ఈ వీకెండ్లోనే ఈ షో కొత్త సీజన్ ఆరంభం కాబోతోంది. మరి ఒకప్పుడు ఈ షోను నడిపించిన యాంకర్ ఓంకారే మళ్లీ దీన్ని హోస్ట్ చేయబోతున్నాడా.. వేరే యాంకర్లు తెరపైకి వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ముందు కంటే గ్రాండ్‌గా ఈ షోను రన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త కాన్సెప్ట్‌లు ప్రవేశపెడతారట.
యాంకర్ ఓంకార్ తన ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో ప్రొడ్యూస్ చేసిన ఈ షో అప్పట్లో భారీ టీఆర్పీలు తెచ్చుకుంది. సుందరం మాస్టర్ శివశంకర్ మాస్టర్ లాంటి లెజెండరీ డ్యాన్స్ మాస్టర్లు న్యాయ నిర్ణేతలుగా ఈ షోలకు ఎంతో ఆకర్షణ తీసుకొచ్చారు. ఓంకార్ తర్వాతి కాలంలో ఇంకెన్నో షోలు చేయడానికి, ఏకంగా దర్శకుడిగా మారి రాజు గారి గది లాంటి హిట్ సినిమాలు తీయడానికి పునాది వేసింది ఈ షోనే.
ఈ షోల ద్వారా ఎంతోమంది డ్యాన్సర్లకు పేరొచ్చింది. సినీ అవకాశాలు కూడా దక్కాయి. సంక్రాంతి సినిమా మన శంకర వరప్రసాద్ గారులో హుక్ స్టెప్‌తో గొప్ప పేరు సంపాదించిన సందీప్ సైతం ఈ షో నుంచి వచ్చినవాడే. ఆట అన్నది అతడి ఇంటి పేరుగా కూడా మారిపోయింది. కొత్త సీజన్లో టీవీ సెలబ్రెటీ సుడిగాలి సుధీర్ సందడి చేస్తాడని తెలుస్తోంది. అతడి రోల్ ఏంటన్నది తెలియదు. మరి మళ్లీ ఆట ఒకప్పటిలా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
This post was last modified on February 3, 2026 8:50 am
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…