Movie News

సీనియర్ స్టార్ల సంక్రాంతి… క్లాష్ సాధ్యమేనా

పెళ్లి లేదు ప్రెగ్నెంటూ లేదు, కొడుకు పేరు కృష్ణమనోహర్ అనేది కొత్త సామెత. కొన్ని రిలీజ్ డేట్ల వ్యవహారం చూస్తుంటే అలాగే ఉంది. ప్రతి ఏడాది సంక్రాంతికి జరుగుతున్న వసూళ్ల జాతర పెద్ద దర్శక నిర్మాతలను అదే సీజన్ ని టార్గెట్ చేసుకునేలా ప్రేరేపిస్తోంది. 2027 జనవరి పండక్కు ఇప్పటి నుంచే కర్చీఫులు వేయడం స్టార్టయిపోయింది.

కానీ ఇందులో సాధ్యాసాధ్యాలు ఒకసారి గమనిద్దాం. ముందుగా అనిల్ రావిపూడి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫెస్టివల్ మిస్ కాడనేది బహిరంగ రహస్యం. వెంకటేష్ హీరోగా రానా లేదా కార్తీ లేదా ఫహద్ ఫాసిల్ మరో ముఖ్య పాత్రలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కు రంగం సిద్ధమయ్యింది. నిర్మాత ఫిక్సయ్యాక ప్రకటన వస్తుంది.

అనిల్ రాకలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. ఎందుకంటే వేగంగా తీయడంతో తనకు ఎవరూ సాటి రారు. పైగా విఎఫ్ఎక్స్, లొకేషన్స్ ఎక్కువ డిమాండ్ చేయని కథలు రాసుకుంటాడు కాబట్టి టెన్షన్ ఉండదు. చిరంజీవి – బాబీ కలయికలో తెరకెక్కబోయే గ్యాంగ్ స్టర్ డ్రామాని కెవిఎన్ సంస్థ నిర్మించాల్సి ఉంది.

అయితే జన నాయకుడు వాయిదా, టాక్సిక్ బడ్జెట్ లాంటి కారణాలు ఈ ప్రాజెక్టు ఆలస్యానికి కారణమవుతున్నాయి. సో ఇది క్లియర్ అయితే తప్ప షూటింగ్ మొదలుపెట్టలేరు. పెద్ద బడ్జెట్ కాబట్టి టార్గెట్ పెట్టుకుని అంత ఆషామాషీగా అయితే పరుగులు పెట్టించలేరు. మధ్యలో విశ్వంభర ప్రమోషన్లకు చిరు టైం కేటాయించాలి.

ఇక బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కబోయే మూవీ కూడా సంక్రాంతి ఆప్షన్ వైపే చూస్తోందని ఇన్ సైడ్ టాక్. రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభించబోతున్నారు. పీరియాడిక్ సెటప్ నుంచి గ్యాంగ్ స్టర్ డ్రామా వైపు కథ మారినట్టు ఆల్రెడీ న్యూస్ ఉంది.

ఇక  నాగార్జున. ఈయన వచ్చే ఛాన్స్ అయితే తక్కువే. ఎందుకంటే ప్రస్తుతం ఆర్ కార్తీక్ దర్శకత్వంలో చేస్తున్న వందో సినిమా ఈ ఏడాదే రిలీజ్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కారణాల వల్ల లేట్ అయితే తప్ప తన ముగ్గురు సమకాలీకులతో పోటీ పడటం ఉండకపోవచ్చు. ప్రాధమిక దశలోనే సంక్రాంతి క్లాష్ గురించి ఇంత చర్చ జరిగితే రాబోయే రోజుల్లో ఇంకెంత డిస్కషన్ ఉంటుందో.

This post was last modified on February 2, 2026 12:26 pm

Share

Recent Posts

జిమ్ జిమ్ తార… కావాలనే వైరల్ చేసారా?

జిమ్ జిమ్ తార.. గత నాలుగైదు రోజులుగా ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్.. ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లో…

12 minutes ago

69 ల‌క్ష‌ల ఓట్లు హుష్‌..

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన... స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌(సర్‌)లో 73 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి. ఇది జరిగి…

44 minutes ago

ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న…

1 hour ago

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

1 hour ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

2 hours ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

2 hours ago