చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత రాజమౌళి ‘బాహుబలి’దే. మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్ సైతం.. తన కలల సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ను తెరకెక్కించడానికి రాజమౌళి ‘బాహుబలి’నే స్ఫూర్తి అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ కోవలోనే మరెన్నో భారీ చిత్రాలు తెరకెక్కాయి.
బాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా సైతం మహాభారతంలో కల్ట్ క్యారెక్టర్ అయిన కర్ణుడి మీద సినిమా తీయడానికి చాలా ఏళ్ల ముందే ప్రణాళికలు రచించాడు. తమిళ స్టార్ హీరో సూర్యతో ఈ సినిమా చేయాలనుకున్నాడు. విక్రమ్ హీరోగా ‘మహావీర కర్ణ’ అనే సినిమా అనౌన్స్ అయినా సరే.. అతను వెనక్కి తగ్గలేదు. కానీ అటు విక్రమ్ సినిమా ముందుకు కదల్లేదు. అలాగే సూర్య చిత్రమూ పట్టాలెక్కలేదు.
కర్ణ సినిమా కోసం ఆరేళ్ల పాటు కష్టపడ్డట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాకేష్ వెల్లడించాడు. స్క్రిప్టుతో పాటు ప్రి ప్రొడక్షన్ మొత్తం పూర్తయిందన్నాడు. అంతే కాక మామూలుగా పాటల కోసం చాలా టైం తీసుకుని, రిలీజ్ ముందు వరకు ఇబ్బంది పెట్టే ఏఆర్ రెహమాన్ ఈ సినిమా కోసం ఆరు పాటలను ఎప్పుడో కంపోజ్ చేసినట్లు రాకేష్ వెల్లడించడం విశేషం.
ఐతే ఇంత కష్టపడ్డాక దురదృష్టవశాత్తూ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోయామని రాకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఐతే ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందనే వార్తల్లో నిజం లేదన్నాడు. అది హోల్డ్‌లో మాత్రమే పడిందని.. కచ్చితంగా సినిమా ముందుకు కదులుతుందని.. ప్రస్తుతం రెహమాన్ ఆల్రెడీ కంపోజ్ చేసిన పాటకు మెరుగులు దిద్దుతున్నాడని చెప్పాడు.
తన ఊహల్లో కర్ణ పాత్రకు సూర్య తప్ప ఇంకొకరు కనిపించలేదని.. కాబట్టి ఎప్పటికైనా సూర్యతోనే ఆ కథను తెరకెక్కిస్తానని చెప్పాడు రాకేష్. బహుశా ఈ చిత్రానికి బడ్జెట్టే పెద్ద సమస్యగా మారి ఉండొచ్చు. కొన్నేళ్లుగా సూర్య మార్కెట్ కూడా బాగా డౌన్ అయింది. ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో అతను పుంజుకుంటే, అన్నీ వర్కవుట్ చేసి సినిమాను ముందుకు తీసుకెళ్తారేమో చూడాలి.
This post was last modified on February 1, 2026 3:47 pm
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…
జాతీయ గేయం వందేమాతరం వ్యవహారంపై జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…