‘పుష్ప-2’ తర్వాత బన్నీ నుంచి వస్తుందనుకున్న సినిమా వేరు. అతను ఎంచుకున్న సినిమా వేరు. త్రివిక్రమ్‌తో కొన్నేళ్ల నుంచి ప్లానింగ్‌లో ఉన్న చిత్రాన్ని పక్కన పెట్టి.. తమిళ దర్శకుడు అట్లీతో మూవీని పట్టాలెక్కించాడు బన్నీ. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గర్నుంచే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. హాలీవుడ్ లెవెల్లో నెవర్ బిఫోర్ మూవీ చేయడానికి బన్నీ, అట్లీ రెడీ అయినట్లు అందరికీ అర్థమైంది.
ఈ చిత్రం కోసం పదుల సంఖ్యలో హాలీవుడ్ టెక్నీషియన్లను తీసుకుంది చిత్ర బృందం. ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది సన్ పిక్చర్స్ సంస్థ. ఐతే సినిమాను ప్రకటించి ఏడాది దాటింది. షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. కానీ ఇప్పటిదాకా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ లుక్, గ్లింప్స్ లాంటివి ఏవీ రిలీజ్ చేయలేదు.
ఐతే ఏప్రిల్ 8న బన్నీ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దర్శకుడు అట్లీ కూడా ఆ దిశగా సంకేతాలు ఇచ్చాడు. ఈ సినిమా అప్‌డేట్ కూడా అతను ఊరించే మాటలు చెప్పాడు.
ప్రతి రోజూ ఈ సినిమా అప్‌డేట్ గురించి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని.. అప్‌డేట్ ఇవ్వడానికి తాము కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని అట్లీ చెప్పాడు. తాము సిద్ధం చేస్తున్నది చాలా ప్రత్యేకంగా ఉంటుందని.. దాన్ని టేస్ట్ చేసినపుడు ‘మ్యాక్స్’ ఫీలింగ్ కలుగుతుందని అతనన్నాడు.
ఈ సందర్భంగా ఈ చిత్ర కథానాయిక దీపికా పదుకొనేపై ప్రశంసలు కురిపించాడు అట్లీ. ఇంతకుముందు ‘జవాన్’లోనూ ఆమెతో కలిసి పని చేశానని.. ఆమె తన లక్కీ ఛార్మ్ అని అట్లీ వ్యాఖ్యానించాడు. తల్లి అయ్యాక చేస్తున్న తొలి చిత్రంలో దీపిక సరికొత్తగా కనిపిస్తుందని అట్లీ తెలిపాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలవుతుందని భావిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates