థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. ‘ఈ నగరానికి ఏమైంది’ ఆ కోవకు చెందిన సినిమానే. ‘పెళ్ళిచూపులు’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన తరుణ్ భాస్కర్.. ఆ తర్వాత రూపొందించిన చిత్రమిది. ఐతే పాజిటివ్ టాకే వచ్చినప్పటికీ.. సినిమా పెద్దగా ఆడలేదు. కానీ తర్వాత టీవీల్లో, ఓటీటీలో ఈ సినిమాను విరగబడి చూశారు.
రెండేళ్ల ముందు రీ రిలీజ్ చేస్తే.. ఫస్ట్ రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ కల్ట్ మూవీకి తరుణ్ భాస్కర్ ఇప్పుడు సీక్వెల్ తీస్తున్నాడు. షూటింగ్ కూడా పూర్తి కావచ్చింది. ఐతే ఫస్ట్ పార్ట్‌లో కీలక పాత్ర పోషించిన సుశాంత్ రెడ్డి ఇందులో లేకపోవడం ‘ఈఎన్ఈ’ ప్రేమికులకు నిరాశ కలిగించే విషయమే. ముందు సినిమా అనౌన్స్ చేసినపుడు సుశాంత్ కూడా ఇందులో భాగమే. కానీ తర్వాత అతను తప్పుకుంటే ‘హిట్’ ఫేమ్ కార్తీక్ తన స్థానంలోకి వచ్చాడు.
ఇటీవలే సుశాంత్ ఈ చిత్రంలో లేని విషయాన్ని దర్శకుడు తరుణ్ భాస్కర్ ఒక పోస్టు ద్వారా వెల్లడించి, ఆ విషయంలో ఒకింత నిరాశను వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత సృజన్ యరబోలు.. సుశాంత్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి అసలు కారణమేంటో వెల్లడించాడు. సినిమా అనౌన్స్ చేసినపుడు సుశాంత్ ఇందులో నటించడానికి సుముఖంగానే ఉన్నాడని.. కానీ తన కుటుంబానికి ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల అతను ఈ చిత్రం నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు సృజన్.
ఈ సిదనిమా మొదలయ్యాక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు సుశాంత్ సంస్థ చేతికి వచ్చిందని.. వైజాగ్ కేంద్రంగా చేయాల్సిన భారీ ప్రాజెక్టు అదని.. దాని కోసం సుశాంత్ పూర్తి స్థాయిలో పని చేయాల్సి ఉందని.. ఒకవైపు సినిమా చేస్తూ దానికి న్యాయం చేయడం సాధ్యం కాదని.. సుశాంత్ అందుబాటులో లేకుంటే ఆ ప్రాజెక్టు తన సంస్థ చేజారుతుందని.. ఆ కమిట్మెంట్ కోసమే అతను ‘ఈఎన్ఈ-2’ నుంచి అయిష్టంగానే తప్పుకున్నాడని సృజన్ చకెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates