Movie News

ప్రభాస్ అభిమానులు షిఫ్ట్ అవ్వాలి

జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు రాజా సాబ్ ప్రస్తావన పదే పదే సోషల్ మీడియాలో తెచ్చి లాభం లేదు. దర్శకుడు మారుతీని ఎంత విమర్శించినా, ఆయన అడ్రెస్సుకి ఎన్ని పార్సిళ్లు పంపించినా లాభముండదు. అవి విల్లా లోపలికి వెళ్లకుండా ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు కాబట్టి గేటు దగ్గర సెక్యూరిటీ వాడుకోవడం తప్ప ఎవరేం చేయలేరు.

ట్రోలింగ్ మరీ హద్దులు దాటిపోవడంతో ఎస్కెఎన్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తర్వాత ట్విట్టర్ లో కొంత వేడి చల్లారింది. సరే మూడేళ్ళ కష్టానికి ఇలాంటి సినిమా ఇచ్చారనే కోపం ఫ్యాన్స్ లో ఉండొచ్చు కానీ ఇప్పుడీ ప్రస్తావన వదిలేసి మూవాన్ అయ్యే టైం వచ్చింది.

డిజాస్టర్లు అందరికీ ఉంటాయి. ఎవరూ మినహాయింపు కాదు. మొన్న రికార్డులు బద్దలుకొట్టిన మన శంకరవరప్రసాద్ గారుకి ముందు చిరంజీవి చేసిన భోళా శంకర్ మర్చిపోయేది కాదు. సంక్రాంతికి వస్తున్నాంకు ముందు వెంకటేష్ ట్రాక్ రికార్డు ఎలా ఉండేది.

అఖండకు మునుపు బాలకృష్ణ ఎలాంటి చేదు ఫలితాలు అందుకున్నారో తెలిసిందే. అంతెందుకు లెజెండరీ ఎన్టీఆర్ సిఎంగా ఉన్నప్పుడు శ్రీనాథ కవిసౌర్వభామ, బ్రహ్మర్షి విశ్వామిత్ర చేస్తే దారుణంగా పోయాయి. మేజర్ చంద్రకాంత్ తో తన సత్తా ఏంటో బాక్సాఫీస్ వద్ద చాటారు. ఆయన చివరి కమర్షియల్ మూవీగా దాని స్థానం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది.

జూనియర్ ఎన్టీఆర్ శక్తి దగ్గర ఆగలేదు. మహేష్ బాబు నాని చూసి బాధ పడలేదు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసిని గుర్తు పెట్టుకోలేదు. ఎవరికి వారు ఇవన్నీ మాములేనని ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నది కూడా ఇదే. స్పిరిట్ మీదే పూర్తి ధ్యాస పెట్టారు.

ఫ్యాన్స్ అర్జెంటుగా కోరుకుంటున్నది ఏంటో గుర్తించి సందీప్ రెడ్డి వంగాకు సరెండర్ అయిపోయి కష్టపడుతున్నాడు. ఫౌజీకి పెట్టిన ఎఫర్ట్స్ కూడా చాలా పెద్దవి. సో రాజా సాబ్ వదిలేసి డార్లింగ్ ఫ్యాన్స్ ఇకపై వీటికి షిఫ్ట్ అయిపోవాలి. ఇప్పుడు రాజా సాబ్ స్పూఫ్స్, ట్రోల్స్ మీద సమయం ఖర్చు పెడితే నష్టం వాళ్ళకే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

This post was last modified on January 26, 2026 1:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ చెప్పేశాడు.. ఇక బీజేపీనే తేల్చుకోవాలి!

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు మాసాల్లోనే జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ మే…

11 minutes ago

రాజధానికి మువ్వన్నెల శోభ

అమరావతి రాజధాని పరిధిలోని కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పచ్చదనం, సుందర…

2 hours ago

లక్ష టికెట్లకు తగ్గడం లేదు నారాయణా

తొలి వారంలోనే మూడు వందల కోట్ల గ్రాస్ చకచకా అందుకున్న మన శంకరవరప్రసాద్ గారు తర్వాత వీక్ డేస్ లో…

2 hours ago

అభిమానులు కోరుకున్నది ఇదే స్వామీ

మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి పందెంలో విన్నర్ కాకపోయినా భర్త మహాశయులకు విజ్ఞప్తితో గత సినిమాల కంటే కొంచెం బెటరనిపించడం…

2 hours ago

శిష్యుడికి యువరాజ్ ఛాలెంజ్

భారత క్రికెట్‌లో సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వారసుడు దొరికాడనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో…

4 hours ago

చిరును కదిలించిన మహిళా అభిమాని

మెగాస్టార్ చిరంజీవి ఏ వేదిక మీద మాట్లాడినా.. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అభిమానులే తనకు ఇంధనం అని…

6 hours ago