Movie News

పవన్ అభిమానులతో హరీష్ రాజీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అత్యంత ఆనందాన్నిచ్చి, వారిని తీవ్ర భావోద్వేగానికి గురి చేసిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకడు. దాదాపు పదేళ్ల పాటు సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్న పవన్‌కు 2012లో ‘గబ్బర్ సింగ్’ రూపంలో మరపురాని హిట్ ఇచ్చిన ఘనత హరీష్‌దే. పేరుకు అది రీమేక్ మూవీనే కానీ.. ‘దబంగ్’ నుంచి కేవలం స్టోరీ లైన్ మాాత్రమే తీసుకుని దాని ట్రీట్మెంట్ మొత్తం మార్చేసి.. పవన్‌ను పవర్ ఫుల్‌గా చూపించి అభిమానులను ఉర్రూతలూగించాడు హరీష్.

స్వయంగా పవన్‌కు హరీష్ వీరాభిమాని కావడంతో.. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా తన హీరోను చూపించాడు. ఆ సినిమా చూశాక హరీష్‌కు పవన్ ఫ్యాన్స్ తమ గుండెల్లో గుడి కట్టేశారు. పవన్ అభిమానులతో హరీష్‌ది ప్రత్యేక అనుబంధం. కానీ కొన్నేళ్ల ముందు ఆ బంధం బ్రేక్ అయింది. పదేళ్లకు పైగా విరామం తర్వాత పవన్‌తో హరీష్ సినిమా చేయబోతుంటే.. పవర్ ఫ్యాన్సే దాన్ని వ్యతిరేకించారు. కారణం.. ఇది రీమేక్ అన్న ప్రచారం జరగడమే.

తమిళ హిట్ ‘తెరి’కి ఇది రీమేక్ అని రూమర్స్ రావడంతో ఈ సినిమా వద్దే వద్దు అంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఉద్యమం చేశారు. అప్పటికే రీఎంట్రీలో పవన్ వరుసగా రీమేక్ సినిమాలు చేస్తుండడంతో విసుగెత్తిపోయి ఈ సినిమాను కూడా వ్యతిరేకించారు. ఐతే సినిమాలో ఏముందో తెలియకుండా ముందే ఇలా వ్యతిరేకించడంతో హరీష్‌కు చిర్రెత్తుకొచ్చింది. ఎక్స్‌లో తనను తిట్టే వాళ్లను, ఈ సినిమాను వ్యతిరేకించేవాళ్లను వరుసబెట్టి బ్లాక్ చేసుకుంటూ వెళ్లాడు.

ఇలా వందల అకౌంట్లను బ్లాక్ చేశాడు. వారిలో ఎక్స్‌లో బాగా పాపులర్ అయిన పవన్ కల్ట్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్లందరూ ఎన్నిసార్లు విన్నవించినా హరీష్ కరగలేదు.
ఐతే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రీమేక్ కాదనే సంకేతాలు రావడం, ఇంతకుముందు ఈ చిత్రం మీద ఉన్న నెగెటివిటీ పక్కకు వెళ్లిపోవడం, పైగా సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండడంతో పవన్ అభిమానుల్లో మార్పు వచ్చింది.

హరీష్‌కు సారీ చెప్పి మరీ అన్ బ్లాక్ చేయాలని అభిమానులు కోరుతున్నారు. హరీష్ సైతం మనమంతా ఒక ఫ్యామిలీ అని పేర్కొని.. వరుసగా ఫ్యాన్స్ అకౌంట్లన్నీ అన్ బ్లాక్ చేయడం మొదలుపెట్టాడు. ఇలా హరీష్, పవన్ ఫ్యాన్స్ ఒక రాజీకి వచ్చి మళ్లీ కలిసి పోతుండడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ ముంగిట మంచి పరిణామమని కో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

This post was last modified on January 25, 2026 2:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఇద్దరు తెలుగువారిని వరించిన ‘పద్మశ్రీ’

మన దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో పద్మశ్రీ ఒకటి. కళలు, విద్య, వైద్యం, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక…

51 minutes ago

‘ఈసారి తెలంగాణలో వచ్చేది జాగృతి ప్రభుత్వమే’

మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. బీఆర్ఎస్…

1 hour ago

అమరావతిపై చంద్రబాబు కీలక ప్రకటన.. ఏం జరిగింది?

ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి శాశ్వతమని, దీనిని ఎవరూ కదల్చలేరని ఆయన స్పష్టం…

2 hours ago

అల్లు అర్జున్ తో కంటెంట్ ఉన్న నటుడు?

టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్ అయిన అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ AA22పై బజ్ మాములుగా లేదు. భారీ బడ్జెట్‌తో…

2 hours ago

ప్యారడైజ్ లో ఎంతమంది విలన్లు ఓదెలా…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది ప్యారడైజ్' మూవీ రోజురోజుకూ అంచనాలను…

3 hours ago

బోయపాటే దొరికాడు… జాగ్రత్త పడాల్సిందే గోపి!

నందమూరి బాలకృష్ణతో సరైన మాస్ కంటెంట్ పడితే బాక్సాఫీస్ దగ్గర ఆ వైబ్ మామూలుగా ఉండదు. అయితే అదే బాలయ్యను…

4 hours ago