Movie News

ప్రేమ కథను బయటపెట్టిన యువ నటి

‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టి పాత్రలో అందం, అభినయంతో మెప్పించిన అమ్మాయి ఫరియా అబ్దుల్లా. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఈ హైదరాబాద్ అమ్మాయి.. ‘జాతిరత్నాలు’ లాంటి మరో మంచి బ్రేక్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. కానీ కథానాయికగా నటించిన లవ్ షేర్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, ఆ ఒక్కటీ అడక్కు తనకు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. 

‘మత్తు వదలరా-2’ హిట్టయినా ప్రేక్షకుల ఫోకస్ మొత్తం సత్య మీద నిలిచి, ఫరియాకు పెద్దగా క్రెడిట్ రాలేదు. ఇటీవలే ‘గుర్రం పాపిరెడ్డి’తో పలకరించిన ఫరియాకు ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినా ఫరియాకు అవకాశాలకైతే లోటు లేనట్లే కనిపిస్తోంది. ఓవైపు కథాానాయికగా నటిస్తూ.. చిన్న చిన్న పాత్రలూ చేస్తూ ముందుకు సాగోతోంది. ఫరియా వ్యక్తిగత జీవితం గురించి తాజాగా ఆసక్తికర విషయం వెల్లడైంది. ఆమె రిలేషన్‌షిప్‌లో ఉందట.

హీరోయిన్ల ప్రేమాయణం గురించి మీడియాలో ఊహాగానాలు రావడమే కానీ.. వాళ్లకు వాళ్లుగా దాని గురించి ఓపెన్ కావడం అరుదు. ఫరియా ఆ పనే చేసింది. కాకపోతే తన బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పకుండా తనేం చేస్తాడో మాత్రం వెల్లడించింది. ఫరియా ప్రేమిస్తున్న వ్యక్తి ఇండస్ట్రీకి చెందిన వాడేనట. అతనొక కొరియోగ్రాఫరట. కొన్నేళ్లుగా ఫరియా అతడితో రిలేషన్‌షిప్‌లో ఉందట.

‘‘కొంత కాలంగా నా డ్యాన్స్, ర్యాప్‌లో మార్పు రావడానికి నా బాయ్‌ఫ్రెండే కారణం. అతను సినీ రంగానికి చెందిన వ్యక్తే. కొరియోగ్రఫీలో తన ప్రతిభతో ముందుకు వెళ్తున్నాడు. మేమిద్దరం కలిసి పని చేస్తూ ఒక టీంగా ముందుకు వెళ్తున్నాం. మాది కేవలం ప్రేమ బంధం మాత్రమే కాదు. జీవితానికి సంబంధించి బలమైన అనుబంధం. ఇండస్ట్రీలో ఉంటూ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం వెనుక నా బాయ్ ఫ్రెండ్ ప్రోత్సాహం ఎంతో ఉంది’’ అని ఫరియా తెలిపింది. తన ప్రియుడు కొరియోగ్రాఫర్ అని ఫరియా హింట్ ఇవ్వడంతో.. ఆ వ్యక్తి ఎవరా అని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

This post was last modified on January 23, 2026 12:39 pm

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

48 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

12 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago