Movie News

సంక్రాంతి… ఈ ‘ఓవర్‌లోడ్’ టాలీవుడ్‌కు సేఫేనా?

టాలీవుడ్ సంక్రాంతి సీజన్ ముగిసింది, బాక్సాఫీస్ దగ్గర లెక్కలు తేలిపోయాయి. ఈ ఏడాది మూడు సినిమాలు హిట్‌గా నిలిస్తే, మరో రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు, ముఖ్యంగా అందులో ఒకటి డిజాస్టర్ అయ్యింది. అయితే మార్కెట్‌లో పాజిటివ్ సందడి కనిపించినా, ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం ఒక కొత్త భయం మొదలైంది. అదే ‘సంక్రాంతి ఓవర్‌లోడ్’. గతంలో రెండు మూడు సినిమాలు ఉంటేనే ఎక్కువ అనుకునేవాళ్లం, కానీ ఇప్పుడు ఆ కౌంట్ ఐదు దాటేసింది. వచ్చే ఏడాది ఇది ఇంకా పెరిగినా పెరగొచ్చు.

ఈ సంక్రాంతి నేర్పిన మెయిన్ పాయింట్ ఏంటంటే.. కంటెంట్ ఉంటేనే కింగ్. ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాజాసాబ్’ ఉన్నా, మెగాస్టార్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ గ్రాండ్ గా వచ్చినా.. మిగతా సినిమాలు ఏమాత్రం భయపడకుండా పోటీకి దిగాయి. కానీ ఇక్కడే ఒక లాజిక్ మిస్ అవుతున్నాం. నిజంగా మూడు సినిమాలే వచ్చి ఉంటే, ఈ హిట్ సినిమాల కలెక్షన్స్ రేంజ్ మరోలా ఉండేది. పండగ రద్దీ పెరిగిపోవడం వల్ల ఆడియన్స్ డివైడ్ అయిపోయి, సినిమాల ఫుల్ పొటెన్షియల్ బయటకు రావడం లేదు.

థియేటర్ల లెక్క కూడా ఇప్పుడు ఇష్టానుసారంగా మారుతోంది. మొదట దొరికినన్ని థియేటర్లలో రిలీజ్ చేసి, ఆ తర్వాత టాక్ ని బట్టి షోలు పెంచుకోవచ్చు అనే ధీమా ఎక్కువైపోతోంది. ఇది చిన్న సినిమాలకు ప్లస్ అనిపిస్తున్నా, లాంగ్ రన్ లో మాత్రం మైనస్ అవుతోంది. మెగాస్టార్ MSG సినిమాకు సాలిడ్ టాక్ రావడంతో ఆడియన్స్ అటు డైవర్ట్ అయ్యారు, అలాగే నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ తనదైన కామెడీతో మ్యాజిక్ చేసింది. దీంతో యావరేజ్ టాక్ వచ్చిన రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి సినిమాలకు గట్టి డ్యామేజ్ జరిగింది.

శర్వానంద్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’కి కూడా మంచి టాక్ వచ్చింది, కానీ పండగ హడావుడిలో లైమ్ లైట్ లోకి రావడం ఆలస్యమైంది. థియేటర్లు తక్కువగా ఉండటం, మిగతా సినిమాల పోటీ వల్ల కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడింది. గతంలో ‘శతమానం భవతి’ టైమ్‌లో ఇంత కాంపిటీషన్ లేదు కాబట్టి శర్వాకు సాలిడ్ నంబర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఓవర్‌లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల సూపర్ హిట్ కావాల్సిన సినిమా ఇప్పుడు హిట్ దగ్గరే ఆగిపోయింది.

సంక్రాంతి రేసులో పోటీ ఉండటం మంచిదే కానీ, అది పరిమితి దాటితే సినిమాల కెపాసిటీకి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంది. ఒకేసారి ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం వల్ల ఏ సినిమాకూ వారం రోజుల పాటు కూడా నిలకడగా థియేటర్లు దొరకడం లేదు. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది 6 నుంచి 7 సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కంటెంట్ మీద నమ్మకం ఉండి బరిలోకి దిగుతున్నారా లేక పండగ సీజన్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారా అనేది మేకర్స్ ఆలోచించుకోవాల్సిన విషయం.

This post was last modified on January 23, 2026 7:57 am

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

2 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

3 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

13 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

13 hours ago