త్రివిక్రమ్‍తో సినిమా చేయడానికి మహేష్ ఆమధ్య గట్టిగానే ప్రయత్నించాడు. ఖలేజా రిలీజ్ అయి పది సంవత్సరాలయిన సందర్భంగా మళ్లీ తమ కాంబినేషన్లో సినిమా అతి త్వరలో వస్తోందంటూ స్టేట్‍మెంట్ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ మలి చిత్రం చేయడానికి కమిట్ అయిన త్రివిక్రమ్ వెంటనే మహేష్ సినిమా స్టార్ట్ చేయలేకపోయాడు. ఈలోగా సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెడుతున్నామంటూ ఆ చిత్ర నిర్మాతలు హడావిడి చేసారు. దీంతో మహేష్, త్రివిక్రమ్ సినిమా పక్కకెళ్లిపోయింది. ఇప్పటికీ తారక్ జనవరికి అయినా రాకపోతే త్రివిక్రమ్ వేరే సినిమా ఏదయినా చేసేస్తాడనే వార్తలొస్తున్నాయి. అయితే మహేష్‍తో మాత్రం త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో వుండకపోవచ్చు. ఎందుకంటే మహేష్ ‘సర్కారు వారి పాట’ పూర్తి చేసే సమయానికి తారక్ సినిమాతో త్రివిక్రమ్ బిజీగా వుంటాడు. అదయ్యే నాటికి రాజమౌళి సినిమా కోసం మహేష్ సమాయత్తమవుతుంటాడు.
అందుకే ఈ కాంబినేషన్ ఇప్పట్లో తెరమీదకు రాదు. కానీ సర్కారు వారి పాట తర్వాత రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్ మరో చిత్రం చేయాలని చూస్తున్నాడు. అయిదారు నెలల వ్యవధిలో షూటింగ్ చేయగల డైరెక్టర్‍తో పని చేస్తాడు. అంటే అంత వేగంగా ఇంత పెద్ద సినిమా తీయగల దర్శకులు పూరి జగన్నాథ్ లేదా అనిల్ రావిపూడి మాత్రమే కనుక ఆ ఇద్దరిలో ఎవరొకరితో మహేష్ తదుపరి చిత్రం వుండొచ్చు.
This post was last modified on December 14, 2020 9:23 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…