ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సినిమాలను అల్లు అర్జున్ కొనియాడడం పెద్ద విశేషంగా అనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. బన్నీ రేంజ్ ఎంతో పెరిగిపోయింది. అదే సమయంలో మెగా ఫ్యామిలీతో అల్లు కుటుంబానికి కొంచెం గ్యాప్ కూడా వచ్చిందనే మాట మీడియాలో బలంగా చక్కర్లు కొడుతుంది.
అభిమానుల్లోనూ చీలిక ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిరును, ఆయన సినిమాను బన్నీ మెచ్చుకున్నా.. బన్నీని, తన మూవీని చిరు కొనియాడినా అది వార్తే అవుతోంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే.. సంక్రాంతికి విడులైన సెన్సేషనల్ హిట్టయిన మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ను బన్నీ చూశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో లెంగ్తీ పోస్టు పెట్టి ఆ చిత్రాన్ని ఆకాశానికెత్తేశాడు. ఇంతకీ ఈ పోస్టులో బన్నీ ఏమన్నాడంటే..?
‘‘మన శంకర వరప్రసాద్ గారు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు. ది బాస్ ఈజ్ బ్యాక్.. మెగాస్టార్ చిరంజీవి గార్లు మళ్లీ స్క్రీన్లను తగలబెట్టేయడం చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఫుల్ వింటేజ్ వైబ్స్ వచ్చాయి. వెంకటేష్ గారు అదరగొట్టేశారు. #వెంకీ గౌడ తుంబ చెన్నాగి మాడిదిరా (చాలా బాగా చేశారు). నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ గొప్పగా ఉంది. కేథరిన్ సరదాగా చేసింది. సంక్రాంతి స్టార్ బుల్లి రాజుతో పాటు మిగతా నటీనటులందరూ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌లు ఇచ్చారు.
హుక్ స్టెప్, మెగా విక్టరీ సహా పాటలన్నీ విజిల్స్ కొట్టించేలా ఉన్నాయి. సాంకేతిక నిపుణులందరూ మంచి పనితనం చూపించారు. నిర్మాతల్లో ఒకరైన నా ప్రియమైన కజిన్ సుష్మిత కొణిదెలతో పాటు సాహు గారపాటికి అభినందనలు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషీన్ అనిల్ రావిపూడి గారికి భారీ శుభాకాంక్షలు. సంక్రాంతికి వస్తారు.. హిట్టు కొడతారు.. రిపీటు. ఇది కేవలం సంక్రాంతి బ్లాక్‌బస్టర్ కాదు.. సంక్రాంతి బాస్‌బస్టర్’’ అని ముగించాడు బన్నీ.
This post was last modified on January 20, 2026 4:15 pm
నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌కు పరిమిత ఊరట లభించింది. ఇబ్రహీంపట్నం నకిలీ…
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో…
కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం…
టాలీవుడ్ లో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ తమ భుజాల మీద సినిమాను మోసి నిలబెట్టే…
టాలీవుడ్ కోరుకున్న శుభారంభం 2026కి దొరికేసింది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో నాలుగు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాక మన శంకరవరప్రసాద్…
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన…