రికార్డులను బద్దలు కొడుతున్న మన శంకరవరప్రసాద్ గారు మొదటి వారం గడవడం ఆలస్యం ఏకంగా మూడు వందల కోట్ల గ్రాస్ కు దగ్గరగా వెళ్లడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఎంత బ్లాక్ బస్టర్ అయినా సాధారణంగా సోమవారం ఆక్యుపెన్సీలు తగ్గడం సహజం.
అయితే వరప్రసాద్ గారుకి వచ్చింది యునానిమస్ ఎక్స్ ట్రాడినరి టాక్. ఏబిసి సెంటర్లు తేడా లేకుండా అన్ని చోట్ల భారీ నెంబర్లు నమోదయ్యాయి. కొన్ని చోట్ల ఏకంగా ఆర్ఆర్ఆర్ రికార్డులు ఎగిరిపోయాయి. ఏడో రోజు అత్యధిక గ్రాస్ నమోదు చేసిన తొలి రీజనల్ మూవీగా మరో రికార్డు అందుకుంది. సో డ్రాప్ ఎక్కువగా ఉండకూడదు.
కానీ ఏపీలో చాలా చోట్ల జిఓ ప్రకారం పెంచిన రేట్లే ఉంచారు. బుధవారం దాకా ఇలాగే ఉండబోతున్నాయి. అంటే వీక్ డేస్ మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలంటె బుకింగ్ ఛార్జ్ కాకుండా 302 రూపాయలు చెల్లించాలి. సింగల్ స్క్రీన్ లోనూ 218 రూపాయల దాకా ఉంది. ఇది సామాన్యులను దూరం చేసే ధర.
ఎలాగూ సెలవులు అయిపోయాయి కాబట్టి మండే నుంచే నార్మల్ రేట్లు పెట్టి ఉంటే వరప్రసాద్ జోరు కొంచెం కూడా తగ్గేది కాదు. కానీ అలా చేయకపోవడం వల్ల సిడెడ్ లాంటి ఏరియాల్లో అంకెలు కాస్త తగ్గాయి. తెలంగాణలో గరిష్టంగా ప్రభుత్వం అనుమతించిన ధరలు ఆల్రెడీ అమలులోకి తెచ్చేశారు.
అయితే డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన మరోలా ఉండొచ్చు. ఎలాగూ ఇంకో రెండు వారాల దాకా బలమైన కాంపిటీషన్ లేదు కాబట్టి వీలైనంత వరప్రసాద్ నుంచి రాబట్టుకోవాలని ప్లాన్ చేసుకున్నారు కాబోలు. మూమెంట్ ఇలాగే కొనసాగితే నాలుగు వందల మార్కు అసాధ్యం కాదు. కాకపోతే డౌన్ అవుతున్న ట్రెండ్ ని నిలబెట్టే బాధ్యత టికెట్ రేట్ల మీద ఉంది.
అనగనగా ఒక రాజుకి సైతం ఈ సమస్య ఉంది. 50, 75 రూపాయలు పెంపు తీసుకోవడం వల్ల ఇది కూడా ఆక్యుపెన్సీ డ్రాప్ చూస్తోంది. నిర్మాతలు వీలైనంత త్వరగా ఇలాంటివి గమనించి ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేసుకోవడం చాలా అవసరం.
This post was last modified on January 19, 2026 7:04 pm
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో వెనుకబడి ఉన్న నారా రోహిత్ ఆ మధ్య భైరవంలో చెప్పుకోదగ్గ పాత్ర చేశాడు…
ఒకప్పటిలా టాలీవుడ్ లో హాస్య నటుల స్వర్ణ యుగం లేదన్నది వాస్తవం. తొంభై దశకంలో బ్రహ్మానందం, బాబు మోహన్, మల్లికార్జునరావు,…
దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. మార్గం మధ్యలో జ్యురిచ్‌లో ఆగారు. షెడ్యూల్లో భాగంగా జ్యూరిచ్‌లోనూ పలు కార్యక్రమాల్లో…
మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది.…
సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. తన పార్టీకి…
ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాలతో సంచలనం సృష్టించి.. ఆపై నానితో చేసిన ‘భలే…