భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఇంత సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని ఊహించినవాళ్లు తక్కువే. అనిల్ రావిపూడి ఆయన్ని బాగా ప్రెజెంట్ చేస్తారనే నమ్మకమున్నా మరీ ఈ స్థాయిలో రికార్డుల బూజు దులిపేస్తారని ఎంతమంది అనుకుని ఉంటారు.
కానీ ఏకంగా చరిత్ర సృష్టించే స్థాయిలో ఆరు రోజులుగా మెగా ప్రభంజనం థియేటర్లలో కొనసాగుతోంది. ఫైనల్ రన్ లో ఎంత నెంబర్ వస్తుందనేది అంచనాలకు అందడం లేదు. ట్రేడ్ వర్గాలు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల మధ్యలో ఎక్స్ పెక్ట్ చేస్తుండగా ఫ్యాన్స్ నాలుగు సెంచరీలు దాటేస్తుందని నమ్మకంగా ఉన్నారు.
దీని సంగతి కాసేపు పక్కనపెడితే చిరంజీవికి ఒక రకమైన కొత్త టెన్షన్ మొదలయ్యిందని చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న మూవీ విశ్వంభర. యూవి క్రియేషన్స్ దాని గురించి అప్డేట్స్ ఇవ్వడం బొత్తిగా మానేశారు. వదిలిన శ్రీరామనవమి పాట కూడా ఏమంత సౌండ్ చేయలేకపోయింది.
మొదటి టీజర్ కు నెగటివ్ రెస్పాన్స్ రాగా రెండో గ్లిమ్ప్స్ స్పందన జస్ట్ ఓకే అనిపించుకుంది. విఎఫెక్స్ కోసం సంవత్సరానికి పైగానే దర్శకుడు వశిష్ఠ పని చేస్తున్నారు. కానీ ఇంకా కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. గేమ్ ఛేంజర్ కోసం సంక్రాంతిని వదిలేశామని అప్పట్లో చెప్పిన విశ్వంభర ఏడాది తర్వాత కూడా సైలెంట్ గా ఉంది.
ఇప్పుడు అసలు ఛాలెంజ్ ఏమిటంటే మన శంకరవరప్రసాద్ గారు ఏదైతే చిరంజీవికి సాలిడ్ హిట్టు ఇచ్చిందో దాన్ని చెడగొట్టకుండా, ఎక్స్ ట్రాడినరి అనిపించే స్థాయిలో విశ్వంభర కంటెంట్ ఉందనే నమ్మకాన్ని అభిమానుల్లోనే కాదు బిజినెస్ వర్గాల్లోనూ కలిగించాలి. ఎందుకంటే బడ్జెట్ పరంగా దీని మీద చాలా ఖర్చు పెట్టారు.
గ్రాఫిక్స్ కొలిక్కి వస్తేనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారు. అక్కడ చూస్తేనేమో ఏప్రిల్ దాకా స్లాట్లు బుక్కయిపోయాయి. సో ముందు చిరంజీవి విశ్వంభరని ది బెస్ట్ అనిపించే స్థాయిలో దగ్గరుండి చేయించుకోవాలి. మరీ ఎక్కువ ఆలస్యం చేయకుండా ఈ వేసవిలో రిలీజ్ అయ్యేలా చూసుకుంటే బెటర్.
This post was last modified on January 18, 2026 8:06 pm
దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. మార్గం మధ్యలో జ్యురిచ్లో ఆగారు. షెడ్యూల్లో భాగంగా జ్యూరిచ్లోనూ పలు కార్యక్రమాల్లో…
మెగా అభిమానులు కొన్నేళ్ల నుంచి అంత సంతృప్తిగా లేరు. చిరు నుంచి ‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ వచ్చింది.…
సొంత పార్టీ పెట్టుకుంటానని ప్రకటించిన బీఆర్ ఎస్ మాజీ నాయకురాలు, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. తన పార్టీకి…
ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమకథా చిత్రమ్ లాంటి చిన్న సినిమాలతో సంచలనం సృష్టించి.. ఆపై నానితో చేసిన ‘భలే…
తెలంగాణ ముఖ్యమంత్రిగా నిత్యం ఎంతో బిజీగా ఉండే రేవంత్ రెడ్డి..పుస్తకాలు పట్టుకుని స్టూడెంట్ గా మారనున్నారు. నిజానికి తనకు ఒక్కరోజు…
వీధి శునకాలను అకారణంగా చంపుతున్నారని నటి రేణు దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతూ…