Movie News

చిరు సినిమా చూసి విడాకులు క్యాన్సిల్

సినిమాల ప్రభావం సమాజం మీద ఉండదు అనుకుంటే పొరపాటే. ముఖ్యంగా తెలుగువారి జీవితాల్లో సినిమా అనేది ఒక అంతర్భాగంగా మారిపోయిన నేపథ్యంలో.. దాని ప్రభావం మెజార్టీ జనం మీద మంచి, చెడు రెండు రకాలుగా ఉందనే విషయంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రేక్షకుల మీద చూపిస్తున్న సానుకూల ప్రభావం గురించి ఈ చిత్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

విడాకులు తీసుకుందాం అనుకుంటున్న ఒక జంట మన శంకర వరప్రసాద్ గారు మూవీ చూసి ఆ ఆలోచనను విరమించుకుందట. ఈ విషయం తన దృష్టికి రావడంతో చాలా సంతోషించినట్లు చిరు చెప్పారు.

మూడు నెలల ముందు విడాకులు తీసుకుందాం అనుకుని విడిగా ఉంటున్న భార్యాభర్తలు వేర్వేరుగా మన శంకర ప్రసాద్ గారు సినిమా చూశారని.. అందులో కొన్ని సన్నివేశాలు చూశాక ఆలోచనలో పడి.. మళ్ళీ కలిసి మాట్లాడుకున్నారని.. తర్వాత కలిసి బతకాలని, విడాకులు వద్దని నిర్ణయించుకున్నారని చిరు తెలిపాడు.

ముఖ్యంగా ఇందులో హీరో తల్లి ఒక సన్నివేశంలో భార్యా భర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వాళ్లే పరిష్కరించుకోవాలి, మూడో వ్యక్తి జోక్యం ఉండకూడదు అంటూ చెప్పే డైలాగులు వారిలో మార్పు తెచ్చాయని చిరు వెల్లడించాడు. ఈ సన్నివేశం రాసిన దర్శకుడు అనిల్ రావిపూడికి హ్యాట్సాఫ్ అని చిరు అన్నారు. చిన్న గొడవ, అపార్థాల వల్ల తన నుంచి విడిపోయిన భార్యను.. తనకు దూరమైన పిల్లలను తిరిగి కలవడానికి ఒక భర్త చేసే ప్రయత్నం నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా సాగుతుంది.

సందేశాన్ని వినోదంతో మేళవించి ఆద్యంతం సరదాగా సినిమాను నడిపించాడు రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. చిరు సరసన నయనతార నటించిన ఈ చిత్ర వసూళ్లు ఇప్పటికే రెండొందల కోట్లకు చేరువగా ఉన్నాయి.

This post was last modified on January 16, 2026 10:26 am

Share
Show comments
Published by
Kumar
Tags: ChiruMSG

Recent Posts

రామాయణ ముందు ఇది రైట్ డెబ్యూనా

చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ 'ఏక్ దిన్' ఎట్టకేలకు విడుదల కానుంది. మే 1…

13 minutes ago

బైకర్ కోసం తలుపులు తెరుచుకున్నాయి

మనమే తర్వాత గ్యాప్ తీసుకున్న శర్వానంద్ కు నారి నారి నడుమ మురారి రూపంలో పెద్ద రిలీఫ్ దొరికింది. ఇంత…

1 hour ago

వరదా… వరప్రసాద్ ఆగడం లేదు

బాక్సాఫీస్ వద్ద మన శంకరవరప్రసాద్ గారి తుఫాను కొనసాగుతోంది. మూడు రోజులకే నూటా యాభై కోట్ల మార్కుని దాటేసిన మెగాస్టార్…

2 hours ago

ఇక కూటమిలోకి వారు ఎంట్రీ ఇవ్వొచ్చు

పార్టీలు ఏవైనా.. నాయ‌కులు ఎవ‌రైనా వివాద ర‌హితులుగా ఉన్నారా? వారిపై ఎలాంటి మ‌చ్చ‌లు లేవా? అయితే.. ఇదే ప్రామాణికంగా.. జ‌న‌సేన‌,…

3 hours ago

బాక్సాఫీస్ సంక్రాంతి – కొంచెం ఆందోళన ఎంతో ఆనందం

టాలీవుడ్ గత కొన్నేళ్లలో చూడని పెద్ద స్థాయిలో సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుంటోంది. రాజా సాబ్ వైఫల్యం కాసేపు పక్కనేపడితే మిగిలిన…

3 hours ago

మోడీకే క్రెడిట్.. భారత పాస్ పోర్టుకు పవర్ పెరిగింది

ప్రపంచానికి పెద్దన్నగా.. సూపర్ పవర్ గా.. అగ్రరాజ్యంగా అమెరికాను అభివర్ణిస్తారు. అయితే.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్టు ర్యాంకులో…

6 hours ago