మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఒక పాట వస్తూ ఉంటుంది. రజనీకాంత్ దళపతిలోని సుందరి నేనే నీవంటా సాంగ్ ని మూడు సందర్భాల్లో రెండు భాషల్లో వాడుకున్నారు. ఇది 1992లో ఇళయరాజా కంపోజ్ చేసింది.
మాములుగా తన పాటలు, ట్యూన్స్ ఎవరైనా అనుమతి లేకుండా వాడుకుంటే రాజా ఉపేక్షించడం లేదు. వెంటనే కేసులు వేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ, డ్రాగన్ విషయంలో ఇది జరిగింది. మంజుమ్మాల్ బాయ్స్ కైతే పెద్ద రభసే అయ్యింది. సదరు నిర్మాతలు నష్టపరిహారం కట్టాల్సి వచ్చింది.
అదే తరహాలో మన శంకరవరప్రసాద్ గారుకు కూడా అవుతుందేమోనని ఫ్యాన్స్ అనుమానపడ్డారు. కానీ ఆ భయం గురించి దర్శకుడు అనిల్ రావిపూడి సక్సెస్ మీట్ లో క్లారిటీ ఇచ్చేశారు. నిర్మాతలు పద్దతిగా వెళ్లి ఆయన్ని ముందుగానే కలిసి ఇలా చిరంజీవి గారి సినిమా కోసం పాటలు వాడుకుంటామని అడిగితే, వెంటనే ఒప్పుకున్నారని, ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని అన్నారు.
ఒక పద్దతి ప్రకారం టెక్నికాలిటిస్ అన్నీ చూసుకుని సంప్రదిస్తే ఎలాంటి సమస్య లేదని, మిగిలిన వాళ్ళ విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పిన అనిల్ రావిపూడి చాలా మంది భుజాల మీద పెద్ద భారాన్ని దించేసినట్టే.
ఈ టాపిక్ గురించి ఎన్నో నెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. నిజానికి ఇష్యూస్ వచ్చిన నిర్మాతలు ఇళయరాజాని కలవలేదనే క్లారిటీ వచ్చేసింది. గత నెల ఒక తమిళ సినిమాకు నాలుగు పాటలు అవసరమైతే దానికి కూడా ఇబ్బంది లేకుండా పర్మిషన్లు వచ్చాయి. ఏదైతేనేం రాజాను అపార్థం చేసుకున్నవాళ్లకు మబ్బులు తొలగిపోయినట్టే.
మన శంకరవరప్రసాద్ గారు ప్రీ క్లైమాక్స్ లో వెంకటేష్ తో పాడించిన నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్ ఫ్రెండు పాట అభిలాషలోనిది. ఇది కూడా ఇళయరాజా గీతమే. చిరు- రాజా కాంబోలో ఛాలెంజ్, రాక్షసుడు, కొండవీటి దొంగ, జగదేకవీరుడు అతిలోకసుందరి లాంటి ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates