Movie News

అన్నగారి విడుదలకు రూటు దొరికింది

వాయిదాల మీద వాయిదాలతో అభిమానుల అసహనానికి గురైన వా వాతియర్ (అన్నగారు వస్తారు) ఎట్టకేలకు విడుదలకు రెడీ అయ్యింది. జనవరి 14 రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ అధికారికంగా ప్రకటించింది. అయితే టైం లేని కారణంగా తెలుగు వెర్షన్ ఈ వారం మోక్షం దక్కించుకునే అవకాశం లేనట్టే.

వివరాల్లోకి వెళ్తే వా వతియర్ నిర్మాత జ్ఞానవేళ రాజా తనకు 21 కోట్ల 78 లక్షలు బాకీ చెల్లించాలని అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యాపారవేత్త వేసిన కేసు ఆధారంగా ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఆయన 2011లో భాగస్వామ్యం మీద 12 కోట్ల 85 లక్షలు స్టూడియో గ్రీన్ లో పెట్టుబడి పెట్టారు.

తర్వాత నిర్మాణం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత సుందర్ దాస్ ఇన్వెస్ట్ చేసిన మొత్తం వెనక్కు రాలేదు. దీంతో ఆయన కేసు వేశారు. ఈ న్యాయ పోరాటం 2013 నుంచే జరుగుతుండగా 2019లో కోర్టు ఈ అప్లికేషన్ ను స్వీకరించింది. ఎంతకీ బకాయిలు వసూలు కాకపోవడంతో సుందర్ దాస్ బృందం పిటీషన్లు వేస్తూనే వచ్చింది.

ఈ కారణంగానే డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన వా వతియార్ కు కోర్టు బ్రేక్ వేసింది. వడ్డీతో సహా బాకీ మొత్తం చెల్లించే దాకా థియేటర్, ఓటిటి, డిజిటల్ ఎందులోనూ విడుదల చేయడానికి వీళ్ళెందంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ పొంగల్ బాక్స్ ఆఫీస్ పరాశక్తి తప్ప వేరే సినిమా లేక డ్రైగా ఉండడంతో.. నిర్మాతలు ఏమైనా పరస్పర ఒప్పందం చేసుకొని ఉండొచ్చు అని సినీ వర్గాల సమాచారం.

జన నాయకుడు పొంగల్ రేస్ నుంచి తప్పుకున్నాక బంగారం లాంటి సీజన్ మిస్సవుతోందని భావించిన అన్నగారు వస్తారు నిర్మాత ఫైనల్ గా ఈ రూపంలో పరిష్కరించుకోవడం మంచి విషయమే. ఈ లావాదేవీకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కావాల్సిఉంది.

ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ కాప్ డ్రామాలో కార్తీ విభిన్నమైన క్యారెక్టర్ చేశాడు. మన దగ్గర ఆలస్యమైనా తమిళంలో కనక మంచి టాక్ తెచ్చుకుంటే వసూళ్లు రాబట్టుకోవచ్చు. పరాశక్తికి నెగటివ్ రెస్పాన్స్ కనిపిస్తున్న నేపథ్యంలో వా వతియర్ ఎలాంటి ఫలితం అందుకుంటాడో ఇంకో నాలుగు రోజుల్లో తేలనుంది.

This post was last modified on January 10, 2026 6:35 pm

Share

Recent Posts

పోలీసులు కాదు.. భార్య గ‌ద్దిస్తే నిజం చెప్పాడు!

స‌హ‌జంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితుల‌ను పోలీసులు ప్ర‌శ్నిస్తారు. ముందు మాట‌ల‌తో.. త‌ర్వాత త‌మ‌దైన లాఠీ శైలితోనూ…

1 hour ago

బారికేడ్లు లేని హైవేలు.. ఏంటీ కొత్త విధానం!

ఒక ఊరు నుంచి మ‌రో ఊరుకు జాతీయ ర‌హ‌దారి(హైవే)పై ప్ర‌యాణించే స‌మ‌యంలో టోల్ గేట్లు దాట‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ టోల్…

2 hours ago

నాని వాళ్ళని ఎప్పటికీ వదలడు

నేచుర‌ల్ స్టార్ నాని అంటే ఒక‌ప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఎక్కువ‌గా ఫ్యామిలీ ట‌చ్ ఉన్న…

5 hours ago

డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ చేసేవాడ్ని

నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…

8 hours ago

ప్యార‌డైజ్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ద‌గ్గ‌ర చేరతాడ‌ట‌

ఇండియాస్ నంబ‌ర్ వన్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ విభాగంలో ప‌ని చేయాల‌ని కాబోయే డైరెక్ట‌ర్ కావాల‌నుకున్న ప్ర‌తి వ్య‌క్తికీ…

8 hours ago

ట్రైలర్ లేకపోవడం ఎంత వరకు సేఫ్

అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…

10 hours ago