నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్ లో ప్రకటించినట్టు 112 కోట్ల కలెక్షన్ ప్రభాస్ స్టామినా ఏంటో అనేది మరోసారి చాటింది. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో కొన్ని ఇష్యూస్ కి క్లారిటీ ఇచ్చేశారు.
ముఖ్యంగా ట్రైలర్ లో చూపించిన పెద్ద వయసు ప్రభాస్ క్యారెక్టర్ ని తాజాగా జోడించారు. 8 నిముషాల ఆ ఎపిసోడ్ కొంచెం సర్వర్ సమస్య వల్ల ఇంతకుముందు యాడ్ అవ్వలేదని, ఇప్పుడు కథ అవసరానికి తగ్గట్టు వేరే సన్నివేశాలు ట్రిమ్ చేసి దీన్ని జోడించామని చెప్పుకొచ్చారు. సో పెద్ద డౌట్ తీరిపోయింది.
ఇక సోమవారం నుంచి సాధారణ టికెట్ రేట్లు ఉంటాయని దర్శకుడు మారుతీ అనౌన్స్ చేశారు. ఆదివారం కొంచెం వీలైనంత తిననివ్వండని చెబుతూ మండేతో సాధారణ ధరలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇక దీన్ని డిస్ట్రిబ్యూటర్లు పాటించడమే మిగిలింది.
సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన నేపథ్యంలో టీమ్ ఇంత వేగంగా స్పందించి ఇలాంటి చర్యలు తీసుకోవడం మంచి పరిణామం. ఎందుకంటే ఫ్యాన్స్ అసంతృప్తిని అలాగే వదిలేస్తే చాల రిస్కు. వాళ్ళ కోరుకున్నవాటిని గౌరవించి అందించినప్పుడే మరింత మెరుగైన రిజల్ట్ అందుకోవచ్చు. ఈ విషయంలో పీపుల్స్ మీడియా తీసుకున్నది రైట్ డెసిషన్.
సోషల్ మీడియాలో ప్రచారం జరిగినట్టు వయసు మళ్ళిన ప్రభాస్ గెటప్ రెండో భాగంలో రావడం లేదు. ఇప్పుడే చూసి ఎంజాయ్ చేయొచ్చు. సోమవారం మన శంకరవరప్రసాద్ గారు, అటుపై వరసగా భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నారి నడుమ మురారి విడుదలవుతున్న నేపథ్యంలో ఈ వీకెండ్ రాజా సాబ్ కు చాలా కీలకం.
ఆక్యుపెన్సీని స్టడీగా హోల్డ్ చేస్తే కనక నెంబర్లు మరింత మెరుగవుతాయి. ఆడియన్స్ కంటెంట్ పట్ల హ్యాపీగా ఉన్నారని చెబుతున్న టీమ్ మాటలు ఎంతమేరకు నిజమో ఇంకో నాలుగైదు రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. చూడాలి కొత్త వర్షన్ రియాక్షన్లు ఎలా ఉంటాయో.
This post was last modified on January 10, 2026 2:44 pm
స్థానిక సంస్థల ఎన్నికలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రెండు సంవత్సరాల పాలనకు ఈ ఎన్నికలను రిఫరెండంగా భావిస్తున్న రేవంత్…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైకిల్ తొక్కడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆయన సైకిల్ తొక్కిన వేగం, ఉత్సాహం…
ఏషియన్ సినిమా సంస్థ.. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. హీరోల…
తిరువీర్.. ఈ పేరు చూసి ఇప్పటికీ ఎవరో పరభాషా నటుడు అనుకుంటూ ఉంటారు కానీ.. అతను అచ్చమైన తెలుగు కుర్రాడు. చేసినవి తక్కువ…
ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు సార్లు నోటీసులు అందుకున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ దఫా కూడా.. సిట్…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…