కరోనా టైంలో షూటింగుల్లేక స్టూడియోలన్నీ దారుణంగా దెబ్బ తిన్నాయి. హైదరాబాద్ స్టూడియోలు అందుకు మినహాయింపేమీ కాదు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీ ఉన్నది హైదరాబాద్‌లోనే. దాంతో సహా అన్నీ కరోనా టైంలో కళ తప్పి నష్టాలు చవిచూశాయి. ఐతే లాక్ డౌన్ షరతులు సడలించి షూటింగ్‌లకు మళ్లీ అనుమతులు లభించిన కొంత కాలానికి మళ్లీ స్టూడియోలన్నీ కళకళలాడుతున్నాయి.
ఇప్పుడైతే హైదరాబాద్ స్టూడియోలు కరోనా ముందు కంటే ఎక్కువగా షూటింగ్‌లతో సందడిగా మారడం విశేషం. తెలుగు సినిమాలే కాదు.. వేరే భాషల చిత్రాలు సైతం హైదరాబాద్‌లోనే ఎక్కువగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. కరోనా షరతుల మధ్య ఔట్ డోర్‌లో షూటింగ్ చేయడం చాలా కష్టమవుతోంది. చిన్న స్టూడియోల్లో అన్నా షూటింగ్ కష్టమే.
అందుకే విశాలమైన స్టూడియోలనే ఫిలిం మేకర్లు ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామోజీ ఫిలిం సిటీకి మామూలు డిమాండ్ లేదిప్పుడు. అక్కడ దాదాపు ప్రతి ఫ్లోర్ ఫుల్ అయిపోయిందట. ఫిలిం సిటీలో ఎటు వైపు చూసినా షూటింగ్‌లు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఖాళీగా ఉంచిన భవనాలు, ఫ్లోర్లలోనూ ఇప్పుడు చిత్రీకరణలు జరుగుతున్నాయి.
ఇటీవలే అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కాంబినేషన్లో ‘మే డే’ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోనే మొదలైంది. సూపర్ స్టార్ రజనీకాంత్ మధ్యలో పక్కన పెట్టిన ‘అన్నాత్తె’ చిత్రీకరణ కోసం హైదరాబాద్‌కే వస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమా సైతం షూటింగ్ కోసం హైదరాబాద్ రానుంది. కన్నడ స్టార్ సుదీప్ సైతం తన ‘ఫాంటమ్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోనే చేశాడు. వీటిలో మెజారిటీ షూటింగ్స్‌కు ఫిలిం సిటీ వేదిక అవుతోంది. వీటితో పాటు తెలుగు సినిమాలు కూడా చాలానే అక్కడ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. అన్నపూర్ణ స్టూడియో సైతం షూటింగ్స్‌తో ఫుల్ ప్యాక్ అయినట్లు సమాచారం.
This post was last modified on December 13, 2020 6:24 pm
ఇన్స్టాగ్రామ్ లో తన క్యూట్ ఫొటోస్ తో బాగా పాపులర్ అయిన బ్యూటీ ఆషికా రంగనాథ్. 2023లో కళ్యాణ్ రామ్…
ఏపీ రాజధాని అమరావతిలో తొలి ప్రైవేటు నిర్మాణం ప్రారంభానికి ముహూర్తం ఖరారైనట్టు తెలిసింది. రాజధాని ప్రాంతంలో 2015-17 మధ్య నటుడు,…
ఏపీకి ప్రధాన మంత్రి నరేంద్రమోడీ రానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల తర్వాత.. ప్రధాని…
ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా రాలేదనేది అందరికీ తెలిసిందే. 2014లో ఫైనల్‌కు చేరుకున్నప్పటికీ,…
దృశ్యంతో ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ని సృష్టించిన జీతూ జోసెఫ్ ప్రభావం మలయాళ పరిశ్రమ మీద చాలా…