సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం ఆలస్యంగా చేస్తారా లేక ఏమవుతుందనేది ఇంకా వేచి చూడాలి. అమరన్ నుంచి తెలుగులో మార్కెట్ సంపాదించుకున్న శివ కార్తికేయన్ కు ఆ తర్వాత మదరాసి తీవ్రంగా నిరాశ పరిచింది.
తమిళంలో కాసిన్ని డబ్బులు వచ్చాయి కానీ తెలుగులో మాత్రం దారుణంగా ఫెయిలయ్యింది. అందుకే ఆశలన్నీ పరాశక్తి మీద పెట్టుకున్నాడు. తనకన్నా ఎక్కువ శ్రీలీలకు ఇది ముఖ్యమైన ప్రాజెక్ట్. ఎందుకంటే కోలీవుడ్ లో ఆమె మొదటి అడుగు ఇదే. అందులోనూ సుధా కొంగర లాంటి కంటెంట్ దర్శకురాలి చేతిలో పడింది.
ఇవాళ తమిళంలో వచ్చిన టాక్స్, రెస్పాన్స్ పరాశక్తికి ఏమంత ఆశాజనకంగా కనిపించడం లేదు. ఆలోచనలో నిజాయితీ ఉంది కానీ ఆచరణలో సుధా కొంగర తడబడ్డారనేది విమర్శకుల చెబుతున్న మాట. ఓపెనింగ్స్ భారీగా రాలేదు కానీ ఉన్నంతలో బుక్ మై షో ట్రెండింగ్ అయితే బాగుంది.
ఒకప్పుడు తమిళనాడులో తీవ్ర వివాదాలు, చర్చలకు దారి తీసిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా పరాశక్తి రూపొందింది. లెజెండరీ నటులు శివాజీగణేశన్ ఆల్ టైం క్లాసిక్ టైటిల్ వాడుకోవడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పరాశక్తి ఆ స్థాయిలో లేదనేది వీడియోల రూపంలో వస్తున్న పబ్లిక్ టాక్స్ లో కనిపిస్తోంది.
వీటి సంగతి పక్కనపెడితే జన నాయకుడు వాయిదా పడిన నేపథ్యంలో తమిళ ప్రేక్షకులకు పరాశక్తి మాత్రమే ఓన్లీ ఛాయస్ అయ్యింది. మన దగ్గర అయిదు సినిమాలు రిలీజవుతున్న సీన్ అక్కడ లేదు. ఉన్నంతలో రాజా సాబ్ వైపు మొగ్గు చూపిస్తున్న ఆడియన్స్ ఉన్నారు కానీ ఇవి రెండు కాకుండా చెప్పుకోదగ్గ ఆప్షన్లు లేవు.
జనవరి 14 కార్తీ వా వతియార్ (అన్నగారు వస్తారు) రిలీజ్ కాబోతోందనే వార్త తమిళ మీడియాలో చక్కర్లు కొడుతుంది కానీ షో పడేదాకా నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా శ్రీలీలకు కోరుకున్న బ్రేక్ దక్కడం గురించి అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అనూహ్యంగా టాక్ మారిపోయి ఫలితం మారిపోతే తన అదృష్టమని చెప్పొచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates