ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది ఏ నిమిషంలో వచ్చినా బుక్ మై షో బ్లాస్ట్ అయ్యేలా ఉంది. మాములుగా ప్రభాస్ రేంజ్ ప్యాన్ ఇండియా హీరోకు ముందు రోజు రాత్రే షోలు వేయడం అరుదు.
కల్కి 2898 ఏడి, సలార్ కు తెల్లవారుఝామున పడ్డాయి కానీ బిఫోర్ నైట్ కాదు. కానీ రాజా సాబ్ కు ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి ట్రెండ్ మార్చడం ఆసక్తి రేపుతోంది. ఈ ఫార్ములా కొన్నింటికి ఫెయిలైనా ఓజి లాంటి వాటికి గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. ఇదలా ఉంచితే దర్శకుడు మారుతీ మీద ఎవరెస్ట్ అంత బరువు ఉంది.
ఎందుకంటే సక్సెస్ లేని తన మీద వందల కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టబడి ఉంది. తన కథ మీద నమ్మకంతో ప్రభాస్ హారర్ జానర్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ప్రశాంత్ నీల్, రాజమౌళి, సుకుమార్ లాగా తనకంటూ మారుతీ ఎలాంటి బ్రాండ్ ఏర్పరుచుకోలేదు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ కొడితే సౌండ్ బాలీవుడ్ సర్కిల్స్ దాకా వినపడుతుంది.
ఇది చాలా ఒత్తిడి కలిగించే విషయం. అసలే సోషల్ మీడియా బ్రూటల్ గా ఉంది. కొంచెం యావరేజ్ కన్నా కింద ఉంటే చాలు మిడ్ నైట్ లోపే ఏకేస్తున్నారు. సినిమా బాగుంటే వాళ్లే భుజాన మోస్తారు. ప్రభాస్ అంటే అన్ని ఫ్యాన్ డమ్స్ లో సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి కొంచెం బాగున్నా నిలబెడతారు.
అసలే నార్త్ సైడ్ బుకింగ్స్ ఇంకా ఆశించిన స్థాయిలో లేవు. టాక్ వస్తే పికప్ అవుతాయనే నమ్మకం టీమ్ లో ఉంది. నెగటివ్ పబ్లిసిటీ తట్టుకుని దురంధర్ ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ అయినప్పుడు ప్రభాస్ లాంటి బాహుబలి కటవుట్ కనక బాగుందనే మాట రాజా సాబ్ కు తెచ్చుకుంటే కలెక్షన్ల మోత ఖాయం.
రాబోయే ఆరేడు గంటలు మారుతీకి మూడు సంవత్సరాలతో సమానం. యాంటీ ఫ్యాన్స్ అలెర్ట్ గా ఉన్న ఈ టైంలో తానేంటో బలంగా నిరూపించుకోవాల్సిందే. ఇది క్లిక్ అయితే మారుతీ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఊహించని కాంబినేషన్లు సెట్ అవుతాయి. కెరీర్ లో కోరుకున్న ఎత్తులు చేతికి అందుతాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates